సేంద్రియ సాగు విధానంలో కీలక విషయాలు.. ఎరువుల తయారీ, నీటి వాడకం వివరాలు

సేంద్రియ సాగులో రసాయనాలకు బదులు ప్రకృతి సిద్ధమైన సహజ పదార్థాలను ఎరువులుగా వాడుతారు. వీలైనంత వరకు పంట కోసం నేలను సహజ పద్ధతుల్లోనే సిద్ధం చేస్తారు. కెమికల్స్ కంటే కూడా తక్కువ ఖర్చుతోనే సహజ ఎరువులను తయారు చేస్తారు. నీటిని కూడా పంటకు అవసరమైన మేరకు మాత్రమే అందించాలి.

key points in organic farming from making natural fertilisers to water distribution

హైదరాబాద్: సేంద్రియ వ్యవసాయంపై ఇప్పుడిప్పుడే చాలా మందికి సానుకూల దృక్పథం ఏర్పడుతున్నది. రైతులు ఈ విధానం గురించి తెలుసుకోవడం, వీలైతే అమలు చేయడం చేస్తున్నారు. రైతులతోపాటు ఇతరుల్లోనూ సేంద్రియ విధానంపై మక్కువ పెరిగింది., ఆ విధానంలో పండించిన పంటను, కూరగాయలను, ఇతరత్రాలను కొనుగోలు చేయడానికీ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే సేంద్రియ వ్యవసాయం గురించి కొన్ని కీలక విషయాలు తెలుసుకుందాం.

సేంద్రియ విధానంలో రసాయనాలను వాడరు. భూమిని రసాయనాలు లేకుండానే సజీవంగా మార్చి అంటే.. పంటకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భూమిని సేంద్రియ సాగుకు సిద్ధం చేయడం, పంట వేసిన తర్వాత అందుకు అవసరమైన ఎరువును రసాయనాలు లేకుండా తయారు చేసుకోవడం చాలా కీలకమైన అంశాలు. ఆ తర్వాత వాటికి నీటిని పారించడం కూడా ముఖ్యమైన అంశమే.

సేంద్రియ వ్యవసాయంలో సాధారణంగా కెమికల్స్ లేకుండా ప్రకృతి సిద్ధమైన సహజ పదార్థాలను తీసుకుని ఎరువులు సిద్ధం చేస్తుంటారు. ఉదాహరణకు వేపపిండి.

ఇందులోనూ కెమికల్స్ ఎరువుల కంటే కూడా తక్కువ ఖర్చులోనే ఈ ఎరువులను తయారు చేసుకోవడం మరింత మంచి నిర్ణయం,. సాధారణంగా సేంద్రియ సాగు కోసం తయారు చేసే ఎరువుల్లో ఆవు పేడ, మూత్రం, శనగపిండి, బెల్లం, పుట్టమన్ను వంటి వాటిని వినియోగిస్తారు. ఈ పదార్థాలను అన్నింటిని కలిపి వారం రోజుల పాటు నిల్వ ఉంచుతారు. ఇదే జీవామృతంగా తయారు అవుతుంది.  ఈ జీవామృతం అదే.. ఈ నీటిని మొక్కల మొదల్లో పోయాలి. ఇది పంట సమృద్ధిగా పండటానికి దోహదపడుతుంది. మొక్కల్లోనూ పుష్టిని నింపుతుంది. ఇలా చేయడం వల్ల దిగుబడి ఎక్కవ వస్తుంది. అంతేకాదు, రసాయన ఎరువులతో పోల్చితే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.

ఈ సేంద్రియ ఎరువుల్లోనూ రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఎండపెట్టిన ఆవు పేడ, గేదె పేడ, ఆకు తొక్క, వర్మీ కంపోస్తు, వేప పిండి పదార్థాలను మంచి కలియబెట్టాలి. ఆ పేస్టును నేరుగా మొక్కలకు అందించాలి. మరొకటి, పైన చెప్పుకున్నట్టుగా ఆ సహజ రసాన్ని మొక్కల మొదళ్లకు అందించాలి.

ఏ పంటకైనా భూమి సిద్ధం చేయడం ప్రాథమిక అంశం. సేంద్రియ విధానంలోనూ దుక్కి దున్నడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమిని ఎక్కువ లోతులో దుక్కి చేయరాదు. ఎందుకంటే ఎక్కువ లోతు దుక్కి దున్నితే నేల కోత ఏర్పడుతుంది. ఇది నేలలోని సూక్ష్మజీవులు, ఇతర ప్లవకాలను తగ్గిస్తుంది. తద్వార పంట నష్టం వాటిల్లుతుంది. కాబట్టి నేలను దున్నేటప్పుడు రెండు మూడు సార్లు మాత్రమే 15 సెంటిమీటర్లకు మించకుండా దున్నేసుకోవాలి.

అలాగే, సేంద్రియ విధానంలో పంట మార్పిడి కూడా మంచి నిర్ణయమే. పంట మార్పిడి చేయడం వల్ల నేలలోనూ సూక్ష్మజీవులు బలవర్థకంగా మారుతాయి. ఇవి పంటకు ఉపకరిస్తుంది. 

సేంద్రియ సాగు విధానంలో నీటి అవసరమైన మేరకు మాత్రమే అందించడం చాలా ముఖ్యం. అది కూడా సరైన పద్ధతిలో అందిస్తే ఫలితాలు మంచిగా వస్తాయి. నీటిని ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఎక్కువగా ఉంటే.. ఇతర సమస్యలు వచ్చి పంట నష్టపోతుంది. కాబట్టి, ఈ విధానంలో సరిపడా నీటిని మాత్రమే పారించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios