పౌష్టికాహార భద్రత కోసం బయోఫోర్టిఫైడ్ రకాల పంటలు.. రెండు నిర్దిష్ట కార్యక్రమాలను ప్రారంభించిన ఐసీఏఆర్

పౌష్టికాహార భద్రత కోసం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా బయోఫోర్టిఫైడ్ రకాల పంటలను పెంచేందుకు ఐసీఏఆర్ రెండు నిర్దిష్ట కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి మంగళవారం లోక్‌సభలో తెలిపారు.

ICAR Introduces 2 Special Programmes For Upscaling Biofortified Varieties of Crops Through KVKs

ఢిల్లీ : భారతదేశం వ్యవసాయాధారిత దేశం. అయితే రకరకాల అననుకూల పరిస్థితులు.. వ్యవసాయం నష్టాలనే మిగులుస్తుండడం... చీడపీడలు, తెగుళ్లు.. సకాలంలో వానలు కురవకపోవడం.. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు ముంచెత్తడం.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడం... ఇలాంటి అననుకూల పరిస్థితులతో రైతులు వ్యవసాయం నుంచి తిరుగుముఖం పడుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అందుబాటులోకి తెస్తున్నాయి. 

అందులో భాగంగానే nutritional security కోసం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా biofortified varieties పంటలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ICAR రెండు నిర్దిష్ట కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి Kailash Choudhary మంగళవారం లోక్‌సభలో తెలిపారు.

ఆ రెండు కార్యక్రమాలు ఏంటంటే.. 
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) రెండు కార్యక్రమాలను రూపొందించింది : న్యూట్రి-సెన్సిటివ్ అగ్రికల్చరల్ రిసోర్సెస్ అండ్ ఇన్నోవేషన్స్ (NARI), వ్యవసాయంలో విలువ జోడింపు, సాంకేతికత ఇంక్యుబేషన్ సెంటర్లు (వాటికా). వ్యవసాయంలో మహిళలపై ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద, ICAR "పోషకాహార భద్రత కోసం స్థిరమైన విధానాలు", "పోషక భద్రత వ్యవసాయ కుటుంబాల ఆరోగ్య ప్రమోషన్" వంటి కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది.

లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో, వ్యవసాయాభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కార్యక్రమాలలో భాగంగా పాఠశాలలు, సంఘాలలో న్యూట్రి-గార్డెన్‌లను నిర్మించామని, అక్కడ పోషకాహార విద్యపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు.

రకరకాల పంటలు.. 
ఇంకా దీనిమీద మంత్రి సమాచారం ఇస్తూ.. ICAR వరి, గోధుమ, మొక్కజొన్న, మినుములు, కందులు, వేరుశెనగ, లిన్సీడ్, ఆవాలు, సోయాబీన్‌లలో 79 పోషకాలు అధికంగా ఉండే బయోఫోర్టిఫైడ్ రకాలను అభివృద్ధి చేసింది అని తెలిపారు. కాలీఫ్లవర్, బంగాళదుంప, చిలగడదుంప, గ్రేటర్ యామ్, దానిమ్మ, అదనంగా ఎనిమిది బయోఫోర్టిఫైడ్ ఉద్యాన పంటల రకాలు, వివిధ మాస్ కమ్యూనికేషన్ మాధ్యమాలను కలుపుకొని శిక్షణలు, ప్రదర్శనల ద్వారా రైతులలో ప్రాచుర్యం పొందుతున్నాయి.

ఐరన్, జింక్, కాల్షియం, ప్రొటీన్, విటమిన్ సి, ప్రొవిటమిన్ ఎ, ఒలేయిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఈ సాగులో మెరుగయ్యాయని మంత్రి అభిప్రాయంగా చెప్పుకొచ్చారు..

ICAR గురించి...
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అనేది భారతదేశంలో వ్యవసాయ విద్య, పరిశోధనలను సమన్వయం చేసే స్వయం-పాలన సంస్థ. ఇది వ్యవసాయ మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖకు నివేదిస్తుంది. దీని అధ్యక్షుడు కేంద్ర వ్యవసాయ మంత్రి. ఇది ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన వ్యవసాయ పరిశోధన, బోధనా సంస్థల నెట్‌వర్క్. NARI కార్యక్రమం పోషకాహార భద్రతను పెంపొందించడానికి వ్యవసాయాన్ని పోషకాహారం, న్యూట్రి-స్మార్ట్ గ్రామాలతో అనుసంధానం చేస్తూ కుటుంబ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios