ఎన్టీ రామారావు జర్వం వస్తే ఏం చేస్తాడో తెలుసా? కోడికి మొత్తం ఉప్పు కారం గట్టిగా దట్టించి, దుప్పటి కప్పుకొని
ఎన్టీ రామారావు నటుడిగా ఎంత ఆకట్టుకుంటారో, పర్సనాలిటీ పరంగానూ అంతే హెల్దీగా ఉంటారు. అయితే ఆయన అరోగ్య రహస్యం బయటపెట్టారు బాలయ్య,చంద్రబాబు నాయుడు. ఆ కథేంటంటే?
తెలుగు తెర నటనా సార్వభౌముడు ఎన్టీ రామారావు నటుడిగా, రాజకీయ నాయకుడిగా పీక్ స్టేజ్‌ని చూశాడు. బెస్ట్ యాక్టర్‌గా ఆయన ముందు వరుసలో ఉంటారు. తెలుగు సినిమాకి ఓ కన్నులా ఉన్నారు. అలాగే రాజకీయాల్లోనూ, సీఎంగా చేసిన కార్యక్రమాల విషయంలో ఆయనే ముందు వరుసలో ఉంటారు. రూపులో ఆయన ఆజానుభావుడిలా ఉండేవారు. వెండితెరపై రాముడి వేషం, కృష్ణుడి వేషాల్లో ఆయన్ని కొట్టేవారే లేరు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారంటే చాలా మంది రామారావు ఫోటోలే చూపిస్తుంటారు. అంతగా ఆకట్టుకున్నారు. అలరించారు. కీర్తించబడ్డారు.
రామారావు ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకునేవారు. అయితే ఆయన ఫుడ్ విషయంలోనూ తగ్గేవాళ్లు కాదు. ఎంత బాగా తింటారో, అంతే కష్టం కూడా చేస్తారు. ఆ టైమ్‌లో వర్కౌట్స్ చేయడానికి జిమ్‌లు లేవు. అందుకే ఫిజికల్‌గా కష్టపడేవారు. ఉదయం మూడు గంటలకు లేసి ఎక్సర్‌సైజ్ కోసం ఆయన ఇంటి వద్ద ఇసుక కుప్పని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎత్తి పోసేవారట. అదే వ్యాయామంగా భావించేవారట.
ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చేవి కావని, అంతటి హెల్డీగా ఉండేవారట. అయితే ఎప్పుడైనా జ్వరం వచ్చినా మెడిసిన్ వాడేవారు కాదు. ఆ విషయాన్ని బయటపెట్టారు బాలయ్య. జ్వరం వచ్చిందంటే ఆయన చికెన్ తినేవాడట. పెద్దాయన(ఎన్టీ రామారావు) లేవగానే ఓ కోడి మొత్తాన్ని తినేవారని, ఆయన ఆరోగ్య రహస్యం అదే అని చెప్పారు. 60 ఏళ్లు వచ్చినా, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవంటే కారణం ఆయన తీసుకునే ఫుడ్, క్రమశిక్షణ అని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా బాలయ్య స్పందిస్తూ మరో రహస్యం తెలిపారు. జ్వరం వస్తే ఎన్టీఆర్ చేసే పనేంటో బయటపెట్టాడు.
కోడి మొత్తానికి ఉప్పు కారం గట్టిగా దట్టించేవారట. మంచి ఘాటుగా ఉండేలా చేసి ఆ కోడి మొత్తం తినేవారట. మెడిసిన్ వేసుకోకుండా ఇలా కోడిని తిని మొత్తం దుప్పటి కప్పుకుని పడుకునేవారట. ఫ్యాన్స్ కూడా వేసుకునేవారు కాదు. ఆ హీట్‌కి ఉదయం లేచేసరికి దుప్పటి మొత్తం తడిచిపోయేదని, దీంతో ఆయన జ్వరం మటు మాయమని తెలిపారు బాలకృష్ణ. తనకు కూడా ఎప్పుడైనా జ్వయం వస్తే ఇలానే చేయమని అక్క లోకేశ్వరి చెబుతుండేది, కానీ నా వల్ల కాదని చెబుతుండేవాడిని అన్నారు బాలయ్య. `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 4` షోలో ఈ విషయాన్ని తెలిపారు. నాల్గో సీజన్‌కి మొదటి గెస్ట్ గా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయన్ని అరెస్ట్ చేయడం, జైలు జీవితం, తనపై జరిగిన కుట్ర, పవన్ కల్యాణ్ సపోర్ట్, ఎన్నికల గెలుపు, తాను భవిష్యత్‌లో చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ, చంద్రబాబు మధ్య ఈ సరదా కన్వర్జేషన్ నడిచింది. ఇష్టమైన ఫుడ్ కి సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు ముద్దపప్పు ఆవకాయ, రాగి సంకటి, నాటు కోడిపులుసు పెట్టారు. రాయలసీమ స్పెషల్ రాగి సంకటి, నాటు కోడి అని తెలిపారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు ఎలా తినేవారనే విషయాన్ని చంద్రబాబు, బాలయ్య వెల్లడించారు. ఇది ఆసక్తికరంగా మారింది. అయితే పూర్తి ఎపిసోడ్ మాత్రం అంత కిక్ ఇవ్వలేకపోయింది. చాలా ప్లాట్‌గా సాగిందని చెప్పొచ్చు.
Read more: ఆ స్టార్ హీరోయిన్‌తో పెళ్లికి రెడీ అయిన వెంకటేష్ ? మధ్యలో అడ్డుపడింది ఎవరు?
also read: `లగ్గం` మూవీ రివ్యూ, రేటింగ్