Asianet News TeluguAsianet News Telugu

మహిళ చెడ్డీని మాస్కుగా పెట్టుకుని విమానంలోకి.. అడిగితే అడ్డగోలు వాదన.. నిషేధం విధించిన ఎయిర్ లైన్స్...

Floridaలోని ఓ విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్, కరోనా నెగిటివ్ రిపోర్ట్ చూపించిన ప్రయాణికులందరూ విమానంలోకి ఎక్కేసారు. ప్రతి ఒక్కరు నిబంధనలు Kovid Terms పాటిస్తున్నారా? మాస్కులు ధరించారా? అని సిబ్బంది చెక్ చేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ధరించిన మాస్క్ వారికి కాస్త తేడాగా అనిపించింది. పరిశీలించి చూడగా అది మాస్క్ కాదని మహిళలు ధరించే లో దుస్తులను మాస్క్ లా ధరించాడని తెలిసి..షాక్ కు గురయ్యారు. 

Man thrown off flight for wearing thong as face mask at Florida video goes viral
Author
Hyderabad, First Published Dec 18, 2021, 8:44 AM IST

ఫ్లోరిడా : అమెరికాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. విమానంలోకి ఎక్కిన ఓ ప్రయాణికుడు ధరించిన మాస్క్ చర్చనీయాంశంగా మారింది. దానివల్ల అతని మీద నిషేధం కూడా విధించారు. ఇంతకీ ఇంత రచ్చకు కారణమైన ఆ మాస్క్ ఏంటీ..? ఆ ప్రయాణికుడు అలాంటి మాస్క్ ఎందుకు ధరించాడు? వివరాల్లోకి వెడితే... 

Floridaలోని ఓ విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్, కరోనా నెగిటివ్ రిపోర్ట్ చూపించిన ప్రయాణికులందరూ విమానంలోకి ఎక్కేసారు. ప్రతి ఒక్కరు నిబంధనలు Kovid Terms పాటిస్తున్నారా? మాస్కులు ధరించారా? అని సిబ్బంది చెక్ చేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ధరించిన మాస్క్ వారికి కాస్త తేడాగా అనిపించింది. పరిశీలించి చూడగా అది మాస్క్ కాదని మహిళలు ధరించే లో దుస్తులను మాస్క్ లా ధరించాడని తెలిసి..షాక్ కు గురయ్యారు. అలా ఎందుకు చేశారని వారు ప్రశ్నిస్తే.. దీనికి అతడు చెప్పిన సమాధానం విని కంగు తిన్నారు.

అమెరికా ఫ్లోరిడా లోని పోర్ట్ లౌడెర్ డేల్ విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానంలో ఆడమ్ జేన్ (38)  అనే వ్యక్తి Women's lingerie(థోంగ్)ను  మాస్క్ గా ధరించి తన సీట్లో కూర్చున్నాడు. ఇది గమనించిన విమాన సిబ్బంది దాన్ని తొలగించి మాస్కు ధరించాలి అని కోరారు. అందుకు ఆడమ్ జైన్ ససేమిరా అన్నాడు. విమాన సిబ్బందికి ఆడమ్ కి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తరువాత Flight crew అతనిని విమానంలో నుంచి  దింపేశారు.  

ఇప్పటికీ ఆ రెండు దేశాల్లో కరోనా టీకాలు వేయట్లేదు.. ఎరిత్రియా కథ ఇదీ

అయితే, ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ఆడమ్ జేన్ చర్యపై  ఎయిర్లైన్స్ సంస్థ చర్యలు తీసుకుంది. మాస్కు నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ అతడిపై నిషేధం విధించింది. ఈ అంశంపై  సదరు ప్రయాణికుడు మాట్లాడుతూ... విమానంలో తినేప్పుడు, తాగేప్పుడు కూడా మాస్కును ధరించాలని సిబ్బంది సూచిస్తున్నారని.. దానికి నిరసనగా తాను ఈ పని చేసినట్లు పేర్కొన్నాడు.

‘దీనిపై నిరసన తెలిపేందుకు ఇదే ఉత్తమ మార్గంగా భావించా’ అని జేన్ పేర్కొన్నాడు. గతంలో ఓ విమానంలో తాను ఇలాగే ప్రయాణించానని, అది మాస్కులా పనిచేస్తుందని సిబ్బంది తనను ఏమీ అనలేదని చెప్పడం గమనార్హం. 

Dominican Plane Crash: మిమాన ప్రమాదంలో మ్యూజిక్ ప్రొడ్యూసర్, అతని కుటుంబం మృతి.. టేకాఫ్‌ అయిన 15 నిమిషాలకే..

నిరసన తెలపడానికి అతనికి అన్ని రకాలుగా హక్కు ఉంది.. కానీ అది నిబంధనలు అతిక్రమిస్తే ఇదిగో ఇలాగే జరుగుతుంది. అంతేకాదు.. వినడానికి విచిత్రంగా ఉన్న ఇలాంటి నిరసన కార్యక్రమాలు అమెరికాలో కాబట్టి నిషేధంతో వదిలిపెట్టారు. అదే మనదేశంలో అయితే.. ఏ ఎర్రగడ్డకో, వైజాగ్ మెంటల్ హాస్పిటల్ కు పంపించి పరీక్షలు చేయించేవారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios