MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • PTM: అద్దెకు తల్లిదండ్రులు కావాలి.. బెంగళూరు విద్యార్థి వింత ప్రకటన.. రూ. 15,000 ఆఫర్ !

PTM: అద్దెకు తల్లిదండ్రులు కావాలి.. బెంగళూరు విద్యార్థి వింత ప్రకటన.. రూ. 15,000 ఆఫర్ !

Bengaluru : బెంగళూరులో ఒక కాలేజీ విద్యార్థి తన పేరెంట్ టీచర్ మీటింగ్ (PTM) కోసం అద్దెకు తల్లిదండ్రులు కావాలంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీని కోసం అతను ఏకంగా రూ. 15,000 ఆఫర్ చేయడం విశేషం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 16 2026, 09:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమ్మనాన్నగా నటిస్తే 15 వేలు ఇస్తా! బెంగళూరు స్టూడెంట్ బంపర్ ఆఫర్
Image Credit : Gemini

అమ్మనాన్నగా నటిస్తే 15 వేలు ఇస్తా! బెంగళూరు స్టూడెంట్ బంపర్ ఆఫర్

సాధారణంగా పాఠశాలల్లో లేదా కళాశాలల్లో జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ (PTM) అంటే విద్యార్థులకు కాస్త వణుకు పుట్టడం సహజం. మార్కుల గురించి, క్రమశిక్షణ గురించి లెక్చరర్లు తమ తల్లిదండ్రులకు ఏం చెప్తారో అని భయపడుతుంటారు. అయితే, బెంగళూరుకు చెందిన ఒక విద్యార్థి ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఒక వింత మార్గాన్ని ఎంచుకున్నాడు. తన తల్లిదండ్రులకు బదులుగా, నకిలీ తల్లిదండ్రులను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించుకుని సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ. 15,000 ఆఫర్.. షరతులు ఇవే
Image Credit : Asianet News

రూ. 15,000 ఆఫర్.. షరతులు ఇవే

రెడ్డిట్ (Reddit) లో ఈ విద్యార్థి పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. తన కాలేజీలో జరగబోయే పీటీఎం కోసం ఎవరో ఒకరు తండ్రిగా లేదా తల్లిగా నటించడానికి రావాలని ఆ పోస్ట్‌లో కోరాడు. ఈ పని చేసినందుకు గాను ఏకంగా రూ. 15,000 చెల్లిస్తానని ఆఫర్ ఇచ్చాడు. అయితే దీనికి కొన్ని షరతులు కూడా పెట్టాడు. వచ్చే వ్యక్తి వయస్సు 40 ఏళ్లకు పైబడి ఉండాలని, ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలగాలని పేర్కొన్నాడు. ముఖ్యంగా కాలేజీ యాజమాన్యంతో మాట్లాడేటప్పుడు ఎక్కడా అనుమానం రాకుండా నిజమైన తండ్రిలాగే నమ్మించగలగాలని వివరించాడు. సదరు విద్యార్థి తన కాలేజీ జేపీ నగర్‌లో ఉందని, ఇందిరానగర్ పరిసరాల్లో ఉండేవారికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపాడు.

Related Articles

Related image1
ఎమోషన్స్ పక్కన పెట్టండి... IPL ముందు వారికి ఇచ్చిపడేసిన సంజూ !
Related image2
Vijay : దళపతి విజయ్ మాస్ పొలిటికల్ స్కెచ్.. టీవీకే బలం, బలహీనతలు ఏంటో తెలుసా?
35
నెటిజన్ల ఫన్నీ రియాక్షన్లు
Image Credit : Getty

నెటిజన్ల ఫన్నీ రియాక్షన్లు

ఈ వింత ప్రకటన చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నవ్వుకుంటే, మరికొందరు ఆ రోల్‌కు తాము సరిపోతామా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. "మా నాన్న రిటైర్ అయ్యారు, సైడ్ ఇన్కమ్ కోసం ఇలాంటి పని వెతుకుతున్నారు" అని సరదాగా కామెంట్ చేశారు. మరొకరు "నా వయసు 34, కానీ నా గడ్డం, మీసాల్లో తెల్ల వెంట్రుకలు ఉన్నాయి.. నేను తండ్రి పాత్రకు సెట్ అవుతానా?" అని అడిగారు. ఇంకొక యూజర్ అయితే.. "నేను 46 ఏళ్ల వాడిని, కేవలం ఆ కిక్కు కోసం నేను ఉచితంగా రావడానికి సిద్ధం" అని రాసుకొచ్చాడు.

45
2003 నాటి పాత జ్ఞాపకం
Image Credit : Gemini AI

2003 నాటి పాత జ్ఞాపకం

ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో, ఒక నెటిజన్ 2003లో తన క్లాస్‌మేట్ చేసిన ఇలాంటి పనిని గుర్తు చేసుకున్నాడు. "నా స్నేహితుడు ఒకరు తన వంట మనిషికి రూ. 10,000 ఇచ్చి, తండ్రిగా నటించమని కాలేజీకి తీసుకెళ్లాడు. ఆ వంట మనిషి అద్భుతంగా నటించి అందరినీ నమ్మించాడు. అంతా సవ్యంగా సాగిపోతోంది అనుకున్న సమయంలో.. అతని అసలు తండ్రి కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్‌కు హలో చెప్పడంతో అసలు విషయం బయటపడింది" అని షేర్ చేశాడు.

A college classmate did this in 2003.

Hired his good-looking, English-speaking cook to attend the PTM as his father. Paid him ₹10K. It was on a Saturday, and the cook gave an Oscar-level performance.

Everything was perfect.

Until the following Tuesday, when his real father… pic.twitter.com/FIqBZKQIUN

— Narayanan Hariharan (@narayananh) March 13, 2026

55
కాలేజీల్లో పీటీఎం అవసరమా?
Image Credit : Getty

కాలేజీల్లో పీటీఎం అవసరమా?

ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. డిగ్రీ లేదా అంతకంటే పై చదువులు చదివే కాలేజీ విద్యార్థులకు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్‌లు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి వల్లే ఇలాంటి వింత నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, 15 వేల రూపాయలు ఇచ్చి మరీ తండ్రిని అద్దెకు తెచ్చుకోవాలనుకున్న ఈ విద్యార్థి ఆలోచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
బెంగళూరు
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
భార‌తీయులు ఆ దేశంలో వీసా లేకుండా ప్ర‌యాణం.. మోదీ ప‌ర్య‌ట‌న‌లో నేప‌థ్యంలో
Recommended image2
Now Playing
Nepal flash flood Update: నేపాల్ వరదల్లో కొట్టుకుపోయిన కోట్లు విలువ చేసే సోలార్ ప్యానెళ్లు
Recommended image3
Now Playing
Nepal flash flood: నేపాల్ వరద బాధితులకోసం రంగంలోకి దిగిన హెలికాఫ్టర్లు | Asianet News Telugu
Related Stories
Recommended image1
ఎమోషన్స్ పక్కన పెట్టండి... IPL ముందు వారికి ఇచ్చిపడేసిన సంజూ !
Recommended image2
Vijay : దళపతి విజయ్ మాస్ పొలిటికల్ స్కెచ్.. టీవీకే బలం, బలహీనతలు ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved