Dominican Plane Crash: మిమాన ప్రమాదంలో మ్యూజిక్ ప్రొడ్యూసర్, అతని కుటుంబం మృతి.. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే..
డొమినికన్ రిపబ్లిక్ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేశ రాజధాని శాంటో డొమింగోలోని (Santo Domingo) లాస్ అమెరికాస్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (emergency landing) చేస్తున్న సమయంలో ప్రైవేట్ విమానం కుప్పకూలిపోయింది. మృతుల్లో ప్రముఖ మ్యూజిక్ ప్రొడ్యూసర్ జోస్ ఏంజెల్ హెర్నాండెజ్ (Jose Angel Hernandez) , అతని భార్య, కొడుకు ఉన్నారు.
డొమినికన్ రిపబ్లిక్ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేశ రాజధాని శాంటో డొమింగోలోని (Santo Domingo) లాస్ అమెరికాస్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (emergency landing) చేస్తున్న సమయంలో ప్రైవేట్ విమానం కుప్పకూలిపోయింది (private aircraft crashed) . ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ఈ మేరకు ప్రమాదానికి గురైన విమాన ఆపరేటర్ హెలిడోసా ఏవియేషన్ గ్రూప్ తెలిపింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మరణించారని ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికుల్లో ఆరుగురు విదేశీయులని, ఒకరు డొమినికన్ అని పేర్కొంది.
అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానికి మాత్రం Helidosa Aviation Group కారణాలు వెల్లడించలేదు. సిబ్బంది విమానాన్ని ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో సేవలను నిలిపివేశారు. కొన్ని ఫ్లైట్స్ సర్వీసులను రద్దు చేశారు.
ఈ ప్రైవేట్ విమానం డొమినికన్ రిపబ్లిక్‌లోని లా ఇసాబెల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన 15 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలో కుప్పకూలింది. ఇక, ఈ లాంగ్ రేజ్ GIVSP ఫ్లోరిడాలోని మియామికి వెళ్తున్నట్టుగా హెలిడోసా సంస్థ తెలిపింది. ‘ఈ ప్రమాదం మాకు చాలా బాధను, దుఃఖాన్ని కలిగిస్తుంది. మాతో పాటు ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి, సంఘీభావంగా నిలవాలని మేము కోరుతున్నాము’ అని హెలిడోసా ఏవియేషన్ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.
మృతుల్లో ప్రముఖ మ్యూజిక్ ప్రొడ్యూసర్, అతని కుటుంబం
మృతుల్లో ప్రముఖ మ్యూజిక్ ప్రొడ్యూసర్ జోస్ ఏంజెల్ హెర్నాండెజ్ (Jose Angel Hernandez) , అతని భార్య, కొడుకు మృతిచెందారు. మిగిలిన వారు కూడా హెర్నాండెజ్ సన్నిహితులుగా తెలుస్తోంది. ఇక, Flow La Movieతో హెర్నాండెజ్‌కు పాపులారిటీ వచ్చింది. Te Bote జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న అతని సన్నిహితులు, అభిమానులు షాక్ తిన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.