Asianet News TeluguAsianet News Telugu

video news : మేక్ మై ట్రిప్, ఓయోలపై ఆరోపణలు..విచారణకు ఆదేశం...

హోటల్ బుకింగ్ సర్వీస్ మేక్ మై ట్రిప్ మార్కెట్లో ఉన్న పోటీని పక్కకు పెట్టి, ఓయో హోటల్ చైన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తోందని వచ్చిన ఆరోపణలపై  ఇండియన్ రెగ్యులేటర్ విచారణకు ఆదేశించింది.

హోటల్ బుకింగ్ సర్వీస్ మేక్ మై ట్రిప్ మార్కెట్లో ఉన్న పోటీని పక్కకు పెట్టి, ఓయో హోటల్ చైన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తోందని వచ్చిన ఆరోపణలపై  ఇండియన్ రెగ్యులేటర్ విచారణకు ఆదేశించింది.

హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఓయో, మేక్ మై ట్రిప్ రెండూ హోటల్ బుకింగ్ యాప్ లు. వినియోగదారులు ఈ యాప్ ద్వారా తక్కువలో హోటల్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇవి రూమ్ బుకింగ్ ఫీజులో రెవెన్యూ భాగస్వామిగా ఉంటాయి. కానీ ఓయోకి తన సొంత హోటల్ ఫ్రాంచైజీలున్నాయి. తనకున్న బ్రాండ్ తో నెట్ వర్క్ లోని హోటల్స్ లో సౌకర్యాలను స్టాండర్డైజ్ చేసింది. 

ప్రపంచంలోని అతిపెద్ద హోటల్ చైన్స్ లో ఒకటి గురుగ్రామ్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఓయో హోటల్స్. దీని విలువ 10 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 71వేల కోట్లు.  దీనికి ఇండియన్ హోటల్స్ నుండి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇష్టం వచ్చినట్టు ఫీజు పెంచుతున్నారని వచ్చిన ఆరోపణలతో ఓయో తలకిందులవుతోంది.

నాస్దాక్ జాబితాలో ఉన్న మేక్ మై ట్రిప్, ఓయోల మధ్య ఓ అగ్రిమెంట్ ఉందని, దీనివల్లే ఇవి ఫాబ్ హోటల్స్, ట్రీబోలాంటి ఇండియన్ హోటల్ చైన్స్ ని మార్కెట్లోకి అంతగా రాకుండా అడ్డుకుంటున్నాయని FHRAI చెబుతోంది. 

మిగతా అనేక ఆరోపణలతో పాటు FHRAI నుండి వచ్చిన ఫిర్యాదు కూడా చేరింది. ఓయో, మేక్ మై ట్రిప్ లు పోటీని దెబ్బతీస్తున్నాయని, డిస్కౌంట్ల పేరుతో హోటల్స్ నుండి అన్యాయంగా ఫీజు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అసలే భారతీయ మార్కెట్లో హోటల్ బిజినెస్ కి తక్కువ గిరాకీ. యావరేజ్ ఇండస్ట్రీ ధరకంటే 30 శాతం తక్కువకు ఓయోలో రేట్లు ఉంటున్నాయి. దీనివల్ల కస్టమర్లను ఆకర్షించొచ్చు. కానీ దీనివల్ల చిన్న హోటల్స్, ఇండిపెండెంట్ హోటల్స్ బలవంతంగా ఓయో నెట్ వర్క్ లో చేరడమో లేదా ఆదాయాన్ని పోగొట్టుకోవడమో అనే మీమాంసలో పడుతున్నాయి.