నోటి అల్సర్స్ తో బాధ పడకండి...హోమ్ రెమెడీస్ తో తగ్గించుకోండి ఇలా..!
నోటి పూత (Mouth ulcer) సమస్య వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కలిగిస్తుంది.
నోటి పూత (Mouth ulcer) సమస్య వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఏ పదార్థాలను తినాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోటి పూత, నోటిలో పుండ్లు ఏర్పడ్డానికి విటమిన్ బి లోపం కావచ్చు. ఒంట్లో వేడి కూడా కారణం కావచ్చు. ఇలా నోటి పూత రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది అందరిలో కనిపించే సాధారణ సమస్య. సమస్య చిన్నదే అయినప్పటికీ నోటి పూత ద్వారా నోట్లో పెదాల లోపలివైపు, నాలుక మీద, బుగ్గ లోపల పుండ్లు ఏర్పడి ఏ పదార్థాలను తినాలన్నా చాలా బాధగా, ఇబ్బందిగా ఉంటుంది. చివరికి నీళ్లు తాగిన ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా కారపు పదార్థాలు తిన్నప్పుడు విపరీతమైన మంట (Inflammation) కలిగి మరింత బాధను కలిగిస్తుంది. ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా నోటిపూతను తగ్గించుకోవడానికి పాటించవలసిన కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం..