కరోనా కాలం: కొత్త అనారోగ్య సమస్యలకు ఇదే మందు
కరోనా మహమ్మారి నేపథ్యంలో.. ప్రజలు చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో.. ప్రజలు చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనాని జయించిన తర్వాత కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య కొంతకాలం పీడిస్తోంది. అయితే.. ఈ ఆరోగ్య సమస్య మాత్రమే కాకుండా.. మానసిక సమస్యలు కూడా మోదలౌతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలో.. మానసిక ఆరోగ్యాన్ని జయించడానికి వ్యాయామం ఎంతో అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది.వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు వ్యాయామం చేస్తూ చురుకుగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో కోరింది. మానసిక ఆరోగ్యానికి వ్యాయామం చేస్తూ చురుకుగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ విజ్ఞప్తి చేస్తుందని ప్రపంచఆరోగ్య సంస్థ ఏజెన్సీ హెల్త్ ప్రమోషన్ హెడ్ రూడిగెర్ క్రెచ్ విలేకరులతో చెప్పారు.