హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికలపై జాతీయ ఛానెల్స్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ కంటే అత్యధిక స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. తాము 100సీట్లతో అధికారంలోకి వస్తుందన్నారు.

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రజలు సరైన తీర్పునిచ్చారని తాము భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడమే అందుకు నిదర్శనమని తెలిపారు.  

సానుకూల ధోరణితోనే ఎన్నికలు జరిగాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా ప్రజలు నమ్మకం ఉంచారని అందుకు నమోదైన పోలింగ్ నిదర్శనమన్నారు. ప్రజలు నిశబ్ధ విప్లవంతో తీర్పునిచ్చారని తెలిపారు. 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల అంచనాలు తలకిందులు కాబోతున్నట్లు తెలిపారు. పార్టీలో హేమాహేమీలుగా చెప్పుకునేవాళ్ల ఆశలు ఆవిరి కాబోతున్నాయని స్పష్టం చేశారు. తమకు తాము ముఖ్యమంత్రిగా ప్రకటించుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఘోరంగా ఓటమి పాలవ్వబోతున్నట్లు తెలిపారు. 

తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పట్టం కట్టనున్నట్లు సర్వేలు చెప్తున్నట్లు తెలిపారు. ప్రజలపై తమకు నమ్మకం ఉందని అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులపైనా నమ్మకం ఉందని ఆ నమ్మకంతోనే ముందస్తుకు వెళ్లినట్లు తెలిపారు. 

మరోవైపు మాజీఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ పై కేటీఆర్ మండిపడ్డారు. అసలు లగడపాటి చెప్పింది సర్వే ఫలితాలు లా లేవన్నారు. ఆయన చెప్పింది ఏమిటో ఆయనకైనా అర్థమయ్యిందా అంటూ నిలదీశారు. 

గతంలో తెలంగాణ రాదని లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారని కానీ తెలంగాణ సాధించుకున్నామన్నవిషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ దెబ్బతో లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకున్నారని ఈ ఎన్నికల దెబ్బతో లగడపాటి సర్వేల సన్యాసం తీసుకోబోతున్నారని తెలిపారు. 

మరోవైపు కౌంటింగ్ పూర్తయ్యే వరకు టీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఉండేందుకు సరైన ఏజెంట్లను పంపించాలని తెలిపారు. ఆఖరి ఓటు లెక్కింపు అయ్యేవరకు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఆ తర్వాత డిసెంబర్ 11న సంబరాలు చేసుకుందామంటూ స్పష్టం చేశారు. 

ఇకపోతే ప్రతిపక్ష పార్టీలపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయ సన్యానం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈవీఎంలు మారుస్తారు అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తమకు అంత ఖర్మ పట్టలేదన్నారు. 

పొరపాటున కూడా టీఆర్ఎస్ అలాంటి ఆలోచనలకు ఒడిగట్టదన్నారు. అయినా అది సాధ్యం కాదని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఓడిపోయే వాళ్లు కుంటి సాకులు ఎలా చెప్తారో అప్పుడే కాంగ్రెస్ పార్టీ మెుదలుపెట్టేసిందన్నారు. ముందే తొంపలు ఎదుర్కోవడం అంటే ఇదేనన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం చెయ్యడం ప్రజాకూటమికి పెద్ద దెబ్బ అన్నారు. చంద్రబాబు నాయుడు వల్లే ప్రజాకూటమి ఓటమిపాలవ్వబోతుందని తెలిపారు. ఫలితాల అనంతరం చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ నేతలు తిట్టిన తిట్లు తిట్టకుండా తిడతారన్నారు. 

తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీల పొత్తును  ప్రజలు హర్షించలేదన్నారు. ఆ పొత్తు అపవిత్ర కలయిక అని తాము చెప్పామని ప్రజలు కూడా అదే భావించారన్నారు. అలాంటి అనైతిక పొత్తులను ప్రజలు అంగీకరించరనడానికి ఇదే నిదర్శనమన్నారు. 

ఇప్పటి వరకు ఎన్నికల్లో రాజకీయ నాయకులు విమర్శలు ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారని ఇక అలాంటి వాటికి ఫలితాల అనంతరం స్వస్తి చెప్పాలన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత అంతా రెస్ట్ తీసుకుందామని తెలిపారు. 

ఇకపోతే ఈ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు గల్లంతయ్యాయన్నది వాస్తవమని ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలోనే ఈసీని కలిసి దాన్ని సరిదిద్దేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సరిచేసుకోకపోతే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇబ్బంది అన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

లగడపాటి ఎగ్జిట్ పోల్ పై భగ్గుమన్న హరీష్

2014సర్వే ఇలా.. ఈసారి లగడపాటి సర్వే నిజమయ్యేనా..?

కేసీఆర్ గెలుస్తారా, ఓడుతారా: జవాబు దాటేసిన లగడపాటి

రేవంత్ అరెస్ట్ ఓటర్లను ప్రభావితం చేసింది: లగడపాటి

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల