తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ శుక్రవారంతో ముగిసింది. ఇలా పోలింగ్ ముగిసిందో లేదో.. ఇలా కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. జాతీయ సంస్థలు విడుదల చేసిన అన్ని సర్వేలూ.. దాదాపు తీర్పు ఏకపక్షమేనని.. టీఆర్ఎస్ దే మళ్లీ అధికారం అని ప్రకటించాయి. కానీ.. లగడపాటి సర్వే మాత్రం భిన్నంగా ఉంది. టీఆర్ఎస్ కి గెలిచే అవకాశం లేదని.. కచ్చితంగా కూటమే అధికారంలోకి వచ్చితీరుతుందని బల్లగుద్ది మరీ చెప్పారు.

అయితే.. లగడపాటి సర్వేలో నిజమెంత ఉంది..? గతంలో ఆయన విడుదల చేసిన సర్వే ఎంత వరకు నిజమయ్యాయో ఒకసారి చూద్దాం.  2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని లగడపాటి స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్టుగానే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇక సీట్లు విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి 18-22 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. 20 సీట్లు వచ్చాయి.

టీఆర్ఎస్ కు 50-60 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. 63సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ కు 30-40 సీట్లు వస్తాయని చెప్పగా.. 20సీట్లు దక్కించుకుంది. ఇతరులు 7-9 సీట్లు వస్తాయనుకోగా.. 15సీట్లు వచ్చాయని. కాస్త అటుఇటుగా..గత ఎన్నికలపై లగడపాటి సర్వే.. దాదాపు నిజమైంది. మరి ఈసారి ఏమౌతుందో తెలియాలంటే మరో మూడు రోజులు ఎదురుచూడాల్సిందే. 
 

read more news

కేసీఆర్ గెలుస్తారా, ఓడుతారా: జవాబు దాటేసిన లగడపాటి

రేవంత్ అరెస్ట్ ఓటర్లను ప్రభావితం చేసింది: లగడపాటి

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల