హైదరాబాద్: గజ్వెల్ నియోజకవర్గంలో ప్రజా కూటమి అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గెలుస్తారా, లేదా అనే విషయాన్ని వెల్లడించడానికి మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నిరాకరించారు. ఆ విషయం మాట్లాడితే బాగుండదని ఆయన అన్నారు. 

శుక్రవారం సాయంత్రం మీడియాకు ఆయన తన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించిన సమయం తెలిసిందే. ఈ సందర్భంగా గజ్వెల్ పై మీడియా ప్రతినిధులు పదే పదే అడిగినా కూడా ఆయన జవాబు చెప్పడానికి ఇష్టపడలేదు. 

 గజ్వేల్‌లో 88 శాతం పోలింగ్‌ అయిందని, అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందని విలేకరులు ప్రశ్నించగా, అలా వ్యక్తిగతంగా వివరాలు చెప్పబోనని లగడపాటి  స్పష్టం చేశారు. గజ్వేల్‌ ఫలితాన్ని మీ ఊహకు వదిలేస్తున్నానని అన్నారు. 

కేసీఆర్‌ ఓడిపోతారా? అని అడిగితే తానెప్పుడు ఆ మాట ఆనలేదని జవాబిచ్చారు. గజ్వేల్‌ కానిస్టేబుల్‌ చెప్పింది నిజమవుతుందా అన్న ప్రశ్నకు దానికి సమాధానం వచ్చి మూడు నెలలు అయిందని, ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయని అన్నారు. కేసీఆర్ గెలవడం కష్టమేనని కానిస్టేబుళ్లు అన్నారని గతంలో లగడపాటి అన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

రేవంత్ అరెస్ట్ ఓటర్లను ప్రభావితం చేసింది: లగడపాటి

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల