కాంగ్రెస్ నాయకుడు, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కక్షపూరితంగా అరెస్ట్ చేయించారని టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.. ఇవాళ కొడంగల్ లో కేసీఆర్ ప్రచార సభ ఉన్నందును అది విజయవంతం కాదని తెలిసే కేసీఆర్ ఇలా రేవంత్ ను అరెస్ట్ చేయించారని అన్నారు. లేకపోతే అర్థరాత్రి దుర్మార్గంగా రేవంత్ ను అరెస్టు చేయించడం ఏంటని ఉత్తమ్ ప్రశ్నించారు. 

ఓటమి భయంతో టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు గురై ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. నిస్పక్షపాతంగా వుండాల్సిన ఈసీ, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ ఓ పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అర్థరాత్రి తలుపులు బద్దలుగొట్టి మరీ ఇంట్లోకి చొరబడి పోలీసులు రేవంత్ ను అరెస్ట్ చేయడం చూస్తుంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి అరాచక పాలనను తాను ఇప్పటివరకు చూడలేదని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఎన్నికల అనంతరం మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని...అప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి భయానక చర్యలతో ప్రజల అభిప్రాయాన్ని మార్చలేరని రేవంత్ హెచ్చరించారు. ఇలాంటి అరాచకాలు జరిగేకొద్ది కాంగ్రెస్(మహాకూటమి) కి మరింత ప్రజాదరణ పెరుగుతుందని ఉత్తమ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి అరెస్ట్‌‌పై కూతురు నైమిషా రెడ్డి ఏమన్నారంటే...

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్