కొడంగల్ లో సీఎం కేసీఆర్ సభకు వ్యతిరేకంగా ఇవాళ బంద్ కు పిలుపునిచ్చిన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ సమయంలో ఇంట్లోనే వున్న రేవంత్ కూతురు నైమిషా రెడ్డి తన తండ్రి అరెస్ట్ పై స్పందించారు. ఓ ప్రజాప్రతినిధిని పట్టుకుని పోలీసులు ఓ టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రవర్తించారని ఆవేధన వ్యక్తం చేశారు.

ఇంటి తలుపులు బద్దలుకొట్టుకుని మరీ పోలీసులు ప్రవేశించి భయానక వాతావరణం సృష్టించారని అన్నారు. సెర్చ్ వారెంట్ ఉందంటూ ఓ కాగితం చూపించారని...కానీ దాన్ని తమను చదవనివ్వలేదన్నారు. ఏకంగా తన తండ్రి, తల్లి నిద్రించే బెడ్ రూం లోకి బలవంతంగా ప్రవేశించి మరీ అరెస్ట్ చేశారని నైమిషా ఆవేధన వ్యక్తం చేశారు. 

తన తండ్రితో పాటు బాబాయ్‌ని, అనుచరులను చివరకు ఇంట్లో పనిచేసే వారిని కూడా అదుపులోకి తీసుకున్నారని...వారు ఎక్కడ వున్నారో కూడా తమకు చెప్పడం లేదని ప్రశ్నించారు. వారిని ఎక్కడ ఉంచారన్నదానిపై ఇప్పటికీ క్లారిటీ లేదని...ఒక్కో టీవి ఛానల్లో ఒక్కో దగ్గర ఉంచారని చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా తన తండ్రిని ఎక్కడ ఉంచారో చెప్పాలని నైమిషా రెడ్డి డిమాండ్ చేశారు. 

ఇప్పటికే రేవంత్ రెడ్డి అరెస్ట్ తో  కొడంగల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా బందోబస్తును ముమ్మరం చేశారు. సెక్షన్ 144  అమల్లో వున్నందున ఎలాంటి ఆందోళనలు చేయకుండా నిషేదాజ్ఞలు అమల్లో వున్నాయని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్