నిర్భయ యాక్ట్ 2013ప్రకారం 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష విధించే అవకాశం ఉందని కానీ ఇక్కడ అత్యాచారంతోపాటు హత్య కూడా చేశారు కాబట్టి మూడు హత్యల్లోనూ మరణ శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. అలాగే త్వరగా కేసు విచారణ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ట్రయల్స్ కు వెళ్లనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్: హజీపూర్ లో ముగ్గురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడటంతోపాటు హత్యలకు పాల్పడిన మానవమృగం మర్రి శ్రీనివాస్ రెడ్డికి మరణ శిక్ష పడేలా చూస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
శ్రీనివాస్ రెడ్డి అతి దారుణంగా అత్యాచారాం చేసి హత్య చేసిన ముగ్గురు మైనర్ బాలికలేనని సీపీ స్పష్టం చేశారు. 11 ఏళ్ల చిన్నారి కల్పన, తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రావణి, బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్న మనీషాలను అత్యంత పాశవికంగా హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డికి మరణ శిక్ష పడేలా చూస్తామని చెప్పుకొచ్చారు.
నిందితుడికి మరణ శిక్ష పడేలా పోలీస్ శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముగ్గురు చిన్నారులను కోల్పోయిన కుటుంబ సభ్యులను తలచుకుని చాలా ఆవేదన కలుగుతోందన్నారు. కేసును సైంటిఫిక్ విధానంలో ఇన్విస్టిగేషన్ చేస్తున్నట్లు తెలిపారు.
నిర్భయ యాక్ట్ 2013ప్రకారం 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష విధించే అవకాశం ఉందని కానీ ఇక్కడ అత్యాచారంతోపాటు హత్య కూడా చేశారు కాబట్టి మూడు హత్యల్లోనూ మరణ శిక్షలు పడే అవకాశం ఉందన్నారు.
అలాగే త్వరగా కేసు విచారణ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ట్రయల్స్ కు వెళ్లనున్నట్లు తెలిపారు. నిందితుడికి మరణ శిక్ష పడేలా చెయ్యడంతోనే పాటు వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామన్నారు. హజీపూర్ లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. అలాగే అపరిచితుల బైక్ లు ఎక్కకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయసహకారాలు అందేలా చర్యలు తీసుకోనున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆగష్టు 15న పుట్టాడు, మానవమృగంలా మారాడు
హజీపూర్ లోని హత్యలన్నీ శ్రీనివాస్ రెడ్డి చేసినవే: సీపీ
శ్రీనివాస్ రెడ్డి సైకో, నాలుగు హత్యలు చేశాడు : సీపీ భగవత్
హాజీపూర్ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికి ఎముకలు ఎవరివి?
హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం
కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు
శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి
హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...
శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం
బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ
శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు
హాజీపూర్ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే
శ్రావణి హత్య కేసు: నిందితుడి ఇంటికి నిప్పు, ఉరేయాలని డిమాండ్
శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం, ఎస్సై వెంకటేష్ సస్పెన్షన్: సీపీ మహేశ్ భగవత్
లిఫ్ట్ ఇచ్చి నమ్మించేవాడు, ఆ తర్వాత దారుణాలకు పాల్పడేవాడు : హజీపురా హత్యలపై సీపీ మహేశ్ భగవత్
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 30, 2019, 9:05 PM IST