హైదరాబాద్: హజీపూర్ లో కిల్లర్ హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఆగష్టు 15న జన్మించినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.1990 ఆగష్టు15న జన్మించాడని తెలిపారు. 

ఆగష్టు 15న సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి జన్మించాడన్న వార్త సోషల్ మీడియాలో వెల్లడంతో నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున జన్మించి ఇతరు ప్రాణాలను హరించేస్తున్న మానవ మృగం అంటూ మండిపడుతున్నారు. 

ఇతరుల ప్రాణాలను హరిస్తున్న ఈ మానవమృగాన్ని ఉరితియ్యాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని అతనికి మరణశిక్ష పడేలా సెక్షన్లు పెట్టాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాకాకపోతే ప్రజాకోర్టులో ఉరితియ్యాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.