Asianet News TeluguAsianet News Telugu

శ్రీనివాస్ రెడ్డి సైకో, నాలుగు హత్యలు చేశాడు : సీపీ భగవత్

అలాగే ఏప్రిల్ 25న తొమ్మిదో తరగతి విద్యార్థిని శ్రావణిని బైక్ పై తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు. ముగ్గురు మైనర్ బాలికలేనని స్పష్టం చేశారు. ముగ్గురు బాలికలు చంపేసిన తర్వాత కూడా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. 
 

rachakonda cp mahesh bhagavath comments on hajipur murder cases
Author
Hyderabad, First Published Apr 30, 2019, 8:02 PM IST

హైదరాబాద్: హజీపూర్ హత్య కేసుల్లో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిది క్రిమినల్ మనస్తత్వం కలిగిన వ్యక్తి అని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. శ్రీనివాస్ రెడ్డికి భయం అంటూ ఏమీ లేదని పక్కా సైకో అంటూ స్పష్టం చేశారు. 

హజీపూర్ హత్యల కేసుల పురోగతిపై మీడియాతో మాట్లాడిన సీపీ మహేశ్ భగవత్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ఐదు కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. 2015లోనే బొమ్మలరామారం మసిరెడ్డిపల్లిలో దాసరి సువర్ణ అనే మహిళను వేధించన కేసులో అరెస్ట్ అయినట్లు తెలిపారు. 

అయితే లోక్ అదాలత్ లో రాజీ పడటంతో కేసు కొట్టివేయడమైనదన్నారు. 2015లో కల్పన అనే 11 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడని స్పష్టం చేశారు. మార్చినెలలో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్న మనీషాను బైక్ పై లిఫ్ట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారని తెలిపారు. 

అలాగే ఏప్రిల్ 25న తొమ్మిదో తరగతి విద్యార్థిని శ్రావణిని బైక్ పై తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు. ముగ్గురు మైనర్ బాలికలేనని స్పష్టం చేశారు. ముగ్గురు బాలికలు చంపేసిన తర్వాత కూడా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. 

హజీపూర్ లోనే కాకుండా కర్నూలు టూటౌన్ లో ఓ హత్య కేసులో నిందితుడు అంటూ చెప్పుకొచ్చారు. 2017 ఏప్రిల్ 4న పనులు నిమిత్తం వెళ్లిన శ్రీనివాస్ రెడ్డి మిత్రులతో కలిసి ఓ సెక్స్ వర్కర్ ను రూమ్ కి తెచ్చుకున్నాడని అయితే డబ్బులు దగ్గర గొడవ రావడంతో ఆమెను హత్య చేసి వాటర్ ట్యాంక్ లో పడేశాడని తెలిపారు. 

ఆ హత్య కేసులో శ్రీనివాస్ రెడ్డిని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. ఇలా మెుత్తం నాలుగు హత్యలు చేశాడని తెలిపారు. శ్రావణి హత్య కేసు విచారణ చేపడుతున్న తరుణంలో మృతదేహం లభ్యమైన తర్వాత శ్రీనివాస్ రెడ్డి పరారయ్యాడని తెలిపారు. రావిర్యాలలోని బంధువుల నివాసంలో శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

శ్రావణిని హత్య చేసిన తర్వాత గ్రామంలోనే ఉన్నాడని, పెళ్లికి వెళ్లాడని చెప్పుకొచ్చారు. నాలుగు హత్యలు చేసినట్లు శ్రీనివాస్ రెడ్డి అంగీకరించినట్లు తెలిపారు. మెజిస్ట్రేట్ ముందు శ్రీనివాస్ రెడ్డిని హాజరుపరచి పోలీస్ కస్టడీకి తీసుకోనున్నట్లు తెలిపారు. 

గతంలో ఆదిలాబాద్, కరీంనగర్, వేములవాడలలో శ్రీనివాస్ రెడ్డి నివసించాడని అక్కడ కూడా ఏమైనా దారుణాలకు పాల్పడ్డారా అన్న కోణంలో కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. కేసుల విచారణ ఇంకా కొనసాగుతోందని భువనగిరి ఏసీపీ భుజంగరావు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios