హైదరాబాద్: హాజీపూర్‌లో ముగ్గురు మైనర్ విద్యార్ధినులను హత్యచేసిన కేసులో అరెస్టైన సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి పోలీస్ కస్టడీ సోమవారంతో పూర్తికానుంది. అయితే విచారణలో మాత్రం శ్రీనివాస్ రెడ్డి నోరు మెదపలేదని సమాచారం. ఇవాళ సాయంత్రానికి కోర్టులో శ్రీనివాస్ రెడ్డిని హాజరుపర్చనున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామంలో పదో తరగతి విద్యార్థిని శ్రావణి హత్య కేసు విచారణ  సమయంలో కల్పన, మనీషాలను కూడ హత్య చేసినట్టుగా శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నాడు.

అయితే శ్రీనివాస్ రెడ్డికి మరిన్ని కేసులతో కూడ సంబంంధాలు ఉన్నాయనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో  పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకొన్నారు. శ్రీనివాస్ రెడ్డి కస్టడీ సోమవారంతో పూర్తి కానుంది.

ఈ ఐదు రోజుల పాటు విచారణ సమయంలో శ్రీనివాస్ రెడ్డి నోరు మెదపలేదు. దీంతో పోలీసులు తలలు పట్టుకొంటున్నారు.శ్రీనివాస్ రెడ్డి కస్టడీని పొడిగించాలని మరోసారి కోర్టును పోలీసులు కారాలని భావిస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేశారు. శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ ‌లో ఉన్న స్నేహితుల గురించి ఆరా తీశారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులను కూడ పోలీసులు విచారించారు.  

కస్టడీలో శ్రీనివాస్ రెడ్డి నోరు విప్పకపోవడంతో  మరిన్ని రోజుల పాటు ఆయనను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు కూడ ఆయనకు ఈ కేసులో సహకరించి ఉంటారని కూడ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ దిశగా కూడ పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

హాజీపూర్ హార్రర్: కాల్‌డేటా ఆధారంగా శ్రీనివాస్ రెడ్డి విచారణ

హజీపూర్ సీరియల్ కిల్లర్ ప్రేయసి గురించి పోలీసుల ఆరా

హాజీపూర్ హార్రర్: శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతి

హాజీపూర్ హార్రర్: మనీషా, కల్పన కుటుంబాలకు డీఎన్ఏ పరీక్షలు

హాజీపూర్ హార్రర్: పాడుబడిన బావులపై ఆందోళన

హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి లవర్ సేఫ్

హాజీపూర్‌ సీరియల్ కిల్లర్: శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలు ఎవరు?

సైకో కిల్లర్ శ్రీనివాస్‌ రెడ్డిలో మరో కోణం: వేములవాడ యువతితో లవ్

హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆదిలాబాద్‌లో దెబ్బలు తిన్న శ్రీనివాస్ రెడ్డి
  హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి లైఫ్‌లో మరో కోణం (వీడియో)

సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, వరంగల్ జైలుకు తరలింపు

చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు

వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే