భువనగిరి:  హాజీపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావుల్లో తవ్వకాలు చేపట్టిన తర్వాతే వాటిని పూడ్చివేసే విషయమై  నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఏమైనా మృతదేహాలను ఈ బావుల్లో పూడ్చిపెట్టి ఉండొచ్చనే అనుమానాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో బావుల పూడ్చివేతపై  నిర్ణయం తీసుకొనే అవకాశం  ఉంది.

హాజీపూర్ గ్రామంలో  మర్రి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు మైనర్ విద్యార్థినులపై రేప్ చేసి హత్య చేశాడు. శ్రావణి హత్య కేసులో ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే మనీషా, కల్పనలను కూడ హత్య చేసిన విషయాన్ని పోలీసుల విచారణలో శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నారు. 

మనీషా, కల్పనల ఎముకలను ఎఫ్ఎస్‌ఎల్‌‌కు పంపారు. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసురలు నిర్ణయం తీసుకొనే  అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ గ్రామ శివారులోని  పాడుబడిన వ్యవసాయబావుల్లో ఇంకా కూడ మృతదేహాలు ఉండి ఉండొచ్చనే అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఈ బావులను పూడ్చివేయాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

అయితే  ఈ విషయమై శ్రీనివాస్ రెడ్డి నుండి సమాచారాన్ని సేకరించిన తర్వాత  బావుల పూడ్చివేతపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఆదివారం నాడు హాజీపూర్ గ్రామాన్ని యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సందర్శించారు. బావుల పూడ్చివేత విషయమై ఈ సమయంలో గ్రామస్తులు కలెక్టర్‌తో చర్చించారు. ఈ బావుల్లో పూర్తిస్థాయిలో తవ్వకాలను చేపట్టిన తర్వాతే పూడ్చివేయాలని గ్రామస్తులు కోరిన మీదట కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. 

శ్రీనివాస్ రెడ్డిని  కస్టడీ కోరుతూ పోలీసులు భువనగిరి కోర్టులో సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేయనున్నారు. కనీసం ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని  పోలీసులు కోర్టును కోరనున్నారు.

సంబంధిత వార్తలు

హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి లవర్ సేఫ్

హాజీపూర్‌ సీరియల్ కిల్లర్: శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలు ఎవరు?

సైకో కిల్లర్ శ్రీనివాస్‌ రెడ్డిలో మరో కోణం: వేములవాడ యువతితో లవ్

హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆదిలాబాద్‌లో దెబ్బలు తిన్న శ్రీనివాస్ రెడ్డి
  హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి లైఫ్‌లో మరో కోణం (వీడియో)

సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, వరంగల్ జైలుకు తరలింపు

చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు

వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే