Asianet News TeluguAsianet News Telugu

హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆదిలాబాద్‌లో దెబ్బలు తిన్న శ్రీనివాస్ రెడ్డి

సీరియల్ రేపిస్ట్, కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని  తమ కస్టడీలోకి తీసుకోవాలని బొమ్మలరామారం పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు భువనగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 15 రోజుల పాటు తమ కస్టడీకి శ్రీనివాస్ రెడ్డిని ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.
 

Telangana cops to verify if serial killer committed more such offences
Author
Bhuvanagiri, First Published May 2, 2019, 2:54 PM IST

భువనగిరి: సీరియల్ రేపిస్ట్, కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని  తమ కస్టడీలోకి తీసుకోవాలని బొమ్మలరామారం పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు భువనగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 15 రోజుల పాటు తమ కస్టడీకి శ్రీనివాస్ రెడ్డిని ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

హాజీపూర్ గ్రామంలోని పాడుబడిన వ్యవసాయబావిలో మూడు మైనర్ బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ముగ్గురు బాలికలపై రేప్ చేసి శ్రీనివాస్ రెడ్డి హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేశారు. బుధవారం నాడు ఆయనను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.బుధవారం నాడే బొమ్మలరామారం పోలీసులు భువనగిరి కోర్టులో కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. 

 శ్రీనివాస్ రెడ్డి నుండి మరింత సమాచారాన్ని సేకరించేందుకు గాను తమ కస్టడీలోకి తీసుకోవాలని బొమ్మలరామారం పోలీసులు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో శ్రీనివాస్ రెడ్డి పనిచేసిన చోట కూడ ఈ తరహా ఘటనలకు పాల్పడి ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

.కర్నూల్,ఆదిలాబాద్, వేములవాడతో పలు ప్రాంతాల్లో  పనిచేశాడు. ఈ ప్రాంతాల్లో కూడ ఆయన కొన్ని ఘటనలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఆదిలాబాద్‌లో కూడ మహిళను లైంగిక వేధింపులకు పాల్పడినందుకు స్థానికులు దాడి చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించినట్టుగా సమాచారం.ఈ విషయాలను రాబట్టేందుకు కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

మరో వైపు హాజీపూర్ గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కోసం అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం నుండి గ్రామానికి మరో బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి లైఫ్‌లో మరో కోణం (వీడియో)

సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, వరంగల్ జైలుకు తరలింపు

చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు

వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

 

Follow Us:
Download App:
  • android
  • ios