భువనగిరి: హాజీపూర్‌లో ముగ్గురు మైనర్ విద్యార్ధులను హత్య చేసిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి బైక్ రైడ్‌‌లో స్నేహితుడితో ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హాజీపూర్ హత్యల విషయం  వెలుగుచూడక ముందు  తన స్నేహితులతో శ్రీనివాస్ రెడ్డి  ఎంజాయ్ చేస్తూ గడిపిన దృశ్యాలు  వెలుగు చూశాయి. తన స్నేహితుడు బైక్‌ రైడ్ చేస్తున్న సమయంలో   ఆ బైక్ వెనుక శ్రీనివాస్ రెడ్డి కూర్చొన్నాడు.  మరొక స్నేహితుడు ఈ బైక్  రైడింగ్ దృశ్యాలను  తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. 

"

 

శ్రీనివాస్ రెడ్డి స్నేహితుడు బైక్‌ను గుర్రపు స్వారీ చేస్తున్నట్టుగా నటించడంతో  ఆ దృశ్యాలను చూసి శ్రీనివాస్ రెడ్డి నవ్వుతూ కన్పించాడు. ఎప్పుడూ ఒంటరిగా తిరిగే శ్రీనివాస్ రెడ్డిలో మరో కోణాన్ని ఈ దృశ్యాలు బయటపెట్టాయి. స్నేహితులతో అప్పుడప్పుడు సరదగా  గడిపేవాడని ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

హాజీపూర్ గ్రామానికి చెందిన మనీషా,శ్రావణిలతో పాటు మైసిరెడ్డి పల్లికి చెందిన కల్పనలను శ్రీనివాస్ రెడ్డి హత్య చేశారు. 2016లో కర్నూల్ లో ఓ వ్యభిచారిణి హత్య కేసులో కూడ ఆయన నిందితుడుగా ఉన్నాడు.

ఈ ముగ్గురు విద్యార్థినులను తానే హత్య చేసినట్టుగా తేలడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో  ఉన్నాడు.
 

సంబంధిత వార్తలు

సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, వరంగల్ జైలుకు తరలింపు

చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు

వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే