భువనగిరి: హాజీపూర్‌లో ముగ్గురు మైనర్ విద్యార్థులను రేప్ చేసి హత్య  చేసిన  కేసులో అరెస్టైన మర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రేమించిన యువతి ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫేస్‌బుక్‌లో ఓ యువతితో దిగిన ఫోటోలు ఉన్నాయి.  ఆ యువతిని ప్రేమించినట్టుగా  విచారణలో శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు చెప్పారు.

హాజీపూర్‌లో వరుస హత్యల కేసులో నిందితుడిని విచారించిన కేసులో తన ప్రేమ గురించి శ్రీనివాస్ రెడ్డి బయటపెట్టినట్టుగా సమాచారం.  ఆమెను పెళ్లి చేసుకోవాలని  ఆయన భావించారు. అయితే ఆ యువతి కూడ పెళ్లికి అంగీకరించిందని విచారణలో ఒప్పుకొన్నారని సమాచారం. ఈ కారణంగానే ఆ యువతిని శ్రీనివాస్ రెడ్డి వదిలివేశారనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

వేములవాడకు శ్రీనివాస్ రెడ్డి తరచుగా వెళ్లే విషయాన్ని కూడ పోలీసులు గుర్తించారు. అయితే శ్రీనివాస్ రెడ్డి కలిసే యువతి ఎవరనే కోణంలో కూడపోలీసులు ఆరా తీస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డికి రెండు ఫేస్ బుక్ ఖాతాలున్నాయి. ఒక్క ఫేస్‌బుక్ ఖాతాలో సుమారు 600 మంది అమ్మాయిలు  అమ్మాయిలే అతనికి స్నేహితులుగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డిని కస్టడీని తీసుకొన్న తర్వాత ఈ విషయాలన్నింటిపై కేంద్రీకరించే అవకాశాలు లేకపోలేదు.

సంబంధిత వార్తలు

సైకో కిల్లర్ శ్రీనివాస్‌ రెడ్డిలో మరో కోణం: వేములవాడ యువతితో లవ్

హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆదిలాబాద్‌లో దెబ్బలు తిన్న శ్రీనివాస్ రెడ్డి
  హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి లైఫ్‌లో మరో కోణం (వీడియో)

సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, వరంగల్ జైలుకు తరలింపు

చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు

వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే