Asianet News TeluguAsianet News Telugu

సైకో కిల్లర్ శ్రీనివాస్‌ రెడ్డిలో మరో కోణం: వేములవాడ యువతితో లవ్

హాజీపూర్ గ్రామానికి చెందిన  సీరియల్ రేపిస్ట్, కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డిలో మరో కోణం కూడ ఉందని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. 

srinivas reddy loves with vemulawada young lady
Author
Bhuvanagiri, First Published May 3, 2019, 11:21 AM IST


హైదరాబాద్: హాజీపూర్ గ్రామానికి చెందిన  సీరియల్ రేపిస్ట్, కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డిలో మరో కోణం కూడ ఉందని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. మహిళలపై అత్యాచారాలు చేసి హత్య చేయడమే పనిగా పెట్టుకొన్న శ్రీనివాస్ రెడ్డి.... ఓ మహిళను ప్రేమించినట్టుగా గుర్తించారు. తన ప్రేమను ఒప్పుకొన్నందున ఆమెకు ఎలాంటి హనీ తలపెట్టలేదని పోలీసులను అనుమానిస్తున్నారు.

హాజీపూర్ గ్రామంలోని రెండు వ్యవసాయ బావుల్లో మూడు మైనర్ విద్యార్థినుల మృతదేహాలు కలకలం రేపాయి. ఈ ముగ్గురిని అదే గ్రామానికి చెందిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి హత్య చేశాడు. ఈ కేసులో ప్రస్తుతం అతను వరంగల్ సెంట్రల్ జైల్లో  ఉన్నాడు.

హాజీపూర్ గ్రామానికి చెందిన  సైకో శ్రీనివాస్ రెడ్డికి రెండు ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నాయి. అయితే ఒక్క ఫేస్ బుక్ ఖాతాల్లో ఒక్క యువతితో శ్రీనివాస్ రెడ్డి కొన్ని పోటోలను పోస్ట్ చేశాడు. వేములవాడకు చెందిన ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని  శ్రీనివాస్ రెడ్డి భావించాడని తమ దర్యాప్తులో పోలీసులు కనుగొన్నారు.

ఆ యువతి కూడ శ్రీనివాస్ రెడ్డి ప్రేమకు సానుకూలంగా స్పందించినట్టుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.  ఆ యువతి కోసం శ్రీనివాస్ రెడ్డి తరచూ వేములవాడకు వెళ్లేవాడని పోలీసులు చెబుతున్నారు.  ఏడాదిన్నర కాలంగా  ఆ యువతితో శ్రీనివాస్ రెడ్డికి పరిచయం ఉంది.  వేములవాడ దేవాలయానికి  వెళ్లిన సమయంలో  ఆ యువతితో శ్రీనివాస్ రెడ్డికి పరిచయం ఏర్పడింది.

హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి  సమీప గ్రామానికి చెందిన వివాహితతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె తమ కుటుంబ సభ్యుల చెప్పడంతో శ్రీనివాస్ రెడ్డిని చెట్టుకు కట్టేసి కొట్టారు.

అయితే తాను ఎవరినైనా లైంగిక వేధింపులకు పాల్పడిన వారు  ఆ విషయాన్ని బయటకు చెబితే తనపై దాడికి దిగుతారనే అనుమానంతో  మైనర్ విద్యార్ధినులను రేప్ చేసి హత్య చేశాడని పోలీసులు తమ విచారణలో గుర్తించారు.

సంబంధిత వార్తలు

హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆదిలాబాద్‌లో దెబ్బలు తిన్న శ్రీనివాస్ రెడ్డి
  

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి లైఫ్‌లో మరో కోణం (వీడియో)

సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, వరంగల్ జైలుకు తరలింపు

చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు

వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

 

Follow Us:
Download App:
  • android
  • ios