వికారాబాద్ జిల్లా కొడంగల్ లో రేపు(మంగళవారం) ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశిర్వాద సభ నిర్వహిస్తోంది. ఈ సభలో  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు. అయితే ఆయన రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

తనతో పాటు తన అనుచరులపై ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ లు కక్ష పెంచుకున్నారని...అధికారాన్ని అడ్డం పెట్టుకుని  పోలీసులతో దాడులు చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి గతంలో ఆరోపించారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి పోలీసులు తన అనుచరుల ఇళ్లలో దాడులు చేశారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా  పోలీసులకు,ఆయనకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. అనంతరం పోలీసుల సూచన మేరకు నిరసనను విరమించిన రేవంత్ చివర్లో ఓ సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 4వ తేదీన కేసీఆర్ రాక సందర్భంగా బంద్ కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో  ఒక్కసారిగా కొడంగల్ లో వాతావరణం వేడెక్కింది. 

ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ బంద్ పిలుపును ఏమాత్రం లెక్కచేయకుండా కేసీఆర్ సభకు ఏర్పాటు ముమ్మరం చేశారు. దీంతో వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం  అప్రమత్తమయ్యింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎలాంటి ఘర్షణలు, అవాంచనీయ సంఘటనలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రెండు రోజుల పాటు నియోజకవర్గ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు

కొడంగల్ ప్రజల వల్లే.. కేసీఆర్ కి రాజకీయ జీవితం..రేవంత్

ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆ వాహనమే ఎందుకు వాడుతారంటే

అందరి దృష్టి కొడంగల్‌పైనే:ఆ ముగ్గురూ నాన్ లోకల్

రేవంత్ వర్సెస్ పట్నం: గుడికి, గడికి మధ్య పోటీ

సీఎం కుర్చీపై గురి: వ్యూహత్మకంగా రేవంత్ అడుగులు

ఇదిగో డాక్యుమెంట్: సీఎం అవుతారా అంటే రేవంత్ రిప్లయ్ ఇదీ

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?