Asianet News TeluguAsianet News Telugu

(video) కేటీఆర్ కు పొన్నం ఇలా ‘చెప్పు’తున్నారు

దళారులను చెప్పుతో కొట్టండి అని ఐటీ మంత్రి కేటీఆర్ అంటే పొన్నం ప్రభాకర్ మాత్రం ఓ మంత్రి చెప్పుతో కొట్టండి అని మిమ్నల్ని అంటే ఎందుకు స్పందించరు అని ప్రభుత్వం ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ అన్న దళారులు ఎవరు... ?

Ponnams chappal reply to KTRs chappal talk

డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో దళారులు డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి అని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.

 

కేటీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ చెప్పు చూపించి మరీ టీఆర్ఎస్ పై విరుచుకపడుతున్నారు.

అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పుతో కొట్టండి అని ఓ మంత్రి అంటే ఉద్యోగ సంఘాలు ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

 

అయితే కేటీఆర్ దళారులు అనే పదం ఉపయోగిస్తే పొన్నం మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు ఆ మాటలు అన్వయించి ఇలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఇక్కడ దళారులు అని కేటీఆర్ ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది తేలితే అప్పుడు ఉద్యోగసంఘాలు స్పందించే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios