హైదరాబాద్: సినీ నటుడు వేణు మాధవ్ యశోదా ఆసుపత్రిలో చికిత్సకు అయిన ఖర్చును తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెల్లించాడు.
అనారోగ్యంతో వేణు మాధవ్ బుధవారం నాడు మృతి చెందిన విషయం తెలిసిందే.

కొంత కాలంగా వేణుమాధవ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను మంగళవారం రాత్రి యశోదా ఆసుపత్రిలో చేర్పించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వేణుమాధవ్ బుధవారంనాడు మధ్యాహ్నం మృతి చెందారు.  వేణుమాధవ్ మృతి విషయం తెలుసుకొన్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ యశోధా ఆసుపత్రికి చేరుకొని ఆసుపత్రి బిల్లును చెల్లించారు. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సినీ నటుడు వేణుమాధవ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో ఉన్న సమయంలో వేణు మాధవ్ టీడీపీ కార్యాలయంలో పనిచేశారు.  ఈ సంబంధాలతో వేణు మాధవ్ అప్పుడప్పుడూ తలసానిని  కలిసేవారు.

వేణుమాదవ్ చనిపోయిన విషయం తెలుసుకొన్న వెంటనే తలసాని ఆసుపత్రికి చేరుకొన్నాడు. ఆసుపత్రిలో  కార్యక్రమాలను పూర్తి చేసి మృతదేహాన్ని ఇంటికి పంపించారు. రేపు వేణు మాధవ్ అంత్యక్రియలు నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

 

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..