వరంగల్ లో టీఆర్ఎస్ సభ జరుగుతున్న ఏఫెక్టో లేక కేసీఆర్ పై అభిమానమో తెలియదు కానీ, కాంగ్రెస్ మహిళా నేతలంతా ఈ రోజు తెలంగాణ సీఎం జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్ అంటూ తెగ నినదించారు.

బీకాంలో ఫిజిక్స్ లాంటి నేతలు తెలంగాణలో ఎవరూ లేరని ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఆ మధ్య పీవీ సింధూను వాలీబాల్ ప్లేయర్ చేసి తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ... జలీల్ ఖాన్ కు పోటీ ఇచ్చారు.

ఈ విషయంలో తామేం తక్కువా అని భావించారేమో... తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు కూడా తప్పులో కాలేసి జలీల్ ఖాన్ కు సవాలు విసురుతున్నారు.

వరంగల్ లో టీఆర్ఎస్ సభ జరుగుతున్న ఏఫెక్టో లేక కేసీఆర్ పై అభిమానమో తెలియదు కానీ, కాంగ్రెస్ మహిళా నేతలంతా ఈ రోజు తెలంగాణ సీఎం జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్ అంటూ తెగ నినదించారు.

అది కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ తీస్తూ హెచ్చార్సీకి ఫిర్యాదు చేస్తున్న వేళ...

ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాలింతల మరణాలపై హెచ్చార్సీకి ఫిర్యాదు చేయడానికి వచ్చిన కాంగ్రెస్ మహిళా నేతల్లో ఒకరు కేసీఆర్ అని గళమెత్తారు. వెంటనే అక్కడున్న మహిళా నేతలు జిందాబాద్ అనేశారు. అంతేకాదు, సీఎం అన్నప్పుడు కూడా జిందాబాదే కొట్టారు.