రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'వినయ విధేయ రామ' అనే టైటిల్ ని అనుకుంటున్నారు. త్వరలోనే దానికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.

టైటిల్ విని ఇదేదో సాఫ్ట్ ఫిలిం అనుకుంటే పొరపాటే.. ఈ సినిమాలో బోయపాటి యాక్షన్ మార్క్ ఓ రేంజ్ లో కనిపించబోతుందని అంటున్నారు. అయితే ఒక ఫైట్ మాత్రం 'అరవింద సమేత'లో తొలి ఫైట్ సీన్ ని తలపించే విధంగా ఉంటుందని అంటున్నారు.

ఆ ఫైట్ లో ఎన్టీఆర్ తన సిక్స్ ప్యాక్ ని చూపించినట్లుగా.. చరణ్ కూడా చొక్కా లేకుండా ఫైట్ చేయబోతున్నాడట. గతంలో 'ధృవ' సినిమాలో చరణ్ తన సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చాడు. ఇప్పుడు మరోసారి చొక్కా లేకుండా కనిపించనున్నాడు. 

ఈ ఫైట్ కి, అరవింద సమేతలో ఫైట్ కి పోలికలు ఉంటాయని టాక్. అదే గనుక జరిగితే చరణ్ సినిమాకి, అరవింద సమేతతో కంపారిజన్స్ రావడం ఖాయం. అయితే బోయపాటి మాత్రం ఈ ఫైట్ ని తన సినిమాలన్నింటిలో కంటే ది బెస్ట్ గా నిలిచే విధంగా చిత్రీకరించాడని, సినిమాకు ఇదే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.  

ఇవి కూడా చదవండి.. 

చరణ్ సినిమా టైటిల్ ఇదేనట!

బోయపాటి తీరుతో నిర్మాత అసహనం!

ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!

షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?

రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!