మేము లోపలేస్తాం.. జాగ్రత్త

Kcr will send opponents to jail for fake alligations
Highlights

టీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏపీ ప్రభుత్వం దారిలోనే తెలంగాణ సర్కారు నడుస్తోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని అవమానించేలా రాస్తే శిక్ష తప్పదని హెచ్చరించిన చంద్రబాబు సర్కారు అనుకున్నంత పని చేసింది.

 

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అదే దారిలో నడిచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ అంశంపై స్వయంగా సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.

 

ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్టు లేనిపోని ఆరోపణలు చేసే ప్రతిపక్ష పార్టీలపై కేసులు తప్పవని హెచ్చరించారు.

 

టీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

సాక్షాధారాలు లేకుండా ఆరోపణలు చేసేవారిపై క్రిమినల్ కేసులు పెడుతామని ప్రకటించారు. అవినీతి రహితంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని తెలిపారు.

loader