దేవరకద్ర: మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమని టీఆర్ఎస్ చేఫీ కేసీఆర్  చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కాంగ్రెస్, చంద్రబాబులు కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అవినీతిని కక్కిస్తామన్నారు. సోనియాగాంధీపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్  జిల్లా దేవరకద్రలో  ఆదివారం నాడు టీఆర్ఎస్ ఎన్నికల సభలో  కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గిన విషయం సోనియా గాంధీకి కన్పించడం లేదా కేసీఆర్ ప్రశ్నించారు కేసీఆర్ ఓడించే సత్తా లేక చంద్రబాబును భుజాలపై మోసుకొస్తున్నారన్నారు.

తమకు  సోనియా గాంధీ, చంద్రబాబునాయుడులే  పెద్ద కార్యకర్తలని కేసీఆర్ చెప్పారు. సోనియా సభ తర్వాత  టీఆర్ఎస్ కు  మరింత గ్రాఫ్ పెరుగుతోందన్నారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వచ్చినట్టుగా నెలవారీగా వస్తున్న మామూళ్లు  వస్తలేవా... సూట్ కేసులు రావడం లేదనే బాధ మీకు కలుగుతోందా అని  సోనియా ప్రశ్నించారు.

రైతులకు 24 గంటల పాటు విద్యుత్ ను ఇస్తున్నాం, చేనేత కార్మికులకు భరోసా కల్పిస్తున్నాం... ఇవన్నీ చూసీ సోనియా గాంధీ కడుపు తరుక్కుపోతోందా అని  కేసీఆర్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పాలనలో రైతుల సంక్షేమం గురించి ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలని  సోనియా గాంధీడిమాండ్ చేశారు. మోసం చేయడం కాంగ్రెస్ నైజమని కేసీఆర్ చెప్పారు. గత ఎన్నికల్లో చెప్పినట్టుగా లక్ష రూపాయాల పంట రుణాన్ని మాఫీ చేస్తామన్నారు. మరోసారి లక్ష రూపాయాలను మాఫీ చేస్తామన్నారు.

పంజాబ్ లో  పంట రుణ మాఫీ ఇస్తామని కాంగ్రెస్ ప్రచారం చేసింది, కానీ  ఇంతవరకు పంట రుణాన్ని మాఫీ చేయలేదన్నారు.గతంలో 14వేల కోట్లురుణాన్ని మాపీ చేశామన్నారు. వచ్చే ఐదేళ్లలో సుమారు 24 వేల కోట్లు రుణమాఫీని చేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ గడ్డ మీద నిలబడి ఏపీకి  సోనియా గాంధీ ప్యాకేజీ ప్రకటించింది ఏపీకి పారిశ్రామిక విధానంలో భాగంగా తెలంగాణలో కూడ ఇదే ప్యాకేజీని ఇస్తావా లేదా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేయాలని కోరారు.

ఇది తెలంగాణ పోరుగడ్డ... పోరాటాల గడ్డ తెలంగాణలో అడుగుపెట్టే సమయంలో ఈ విషయమై  రాహుల్ స్పష్టం చేయాల్సిందిగా కోరారు.అవినీతి చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. టికెట్ల కోసం  కూడ డబ్బులు తీసుకొన్న చరిత్ర ఉందన్నారు.

కాంగ్రెస్ నేతలు, చంద్రబాబునాయుడుల కుంభకోణాలు కూడ చాలా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాల హయంలో  ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో వారి అవినీతిని కక్కిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

తాజా సర్వే : 106 సీట్లలో టీఆర్ఎస్‌దే విజయం: కేసీఆర్

కేసీఆర్‌కు తాజా ప్రతిపాదనలు: మేనిఫెస్టోకు తుది మెరుగులు

చిచ్చు పెడుతున్న చంద్రబాబు: సుహాసిని పోటీపై కేటీఆర్ వ్యాఖ్యలు

సెటిలర్ల ఓట్లకు గాలం: కేసీఆర్ వ్యూహం ఇదీ

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్

కేటీఆర్‌పై కేసు.. ఎన్నికల సంఘానికి నివేదిక

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూద్దాం: కేటీఆర్‌కు ఉత్తమ్ కౌంటర్

కేసీఆర్‌, కేటీఆర్‌పై పోటీ చేసే అభ్యర్థులెవరో తెలుసా?

"ఎంపీనో.. ఎమ్మెల్యేనో మరణిస్తేనే పట్టించుకుంటారా"... కేటీఆర్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్‌

ప్రగతి నివేదన సభ: 15 నిమిషాల్లో కేటీఆర్‌కు చొక్కా కుట్టించిన టైలర్

ట్విట్టర్‌లో కాదు మైదానంలో ఆడదాం రా...: కేటీఆర్‌కు రేవంత్ సవాల్