తాండూరు: తాజా సర్వే ప్రకారంగా తెలంగాణలో 103 నుండి 106  సీట్లను కైవసం చేసుకొంటుందని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పారు. ఈ సర్వే రిపోర్ట్  నిన్ననే తన చేతికి వచ్చిందన్నారు. అబద్దాలు చెప్పడం తనకు చేతకాదన్నారు. 

ఆదివారం నాడు తాండూరులో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో  కేసీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు, అభ్యర్థులు కాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గెలిస్తేనే నిజమైన ప్రజాస్వామ్యమని చెప్పారు. అభివృద్దిలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు.  

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఎలా ఉందనే విషయాన్ని తాను శనివారం నాడు సమీక్షించినట్టు చెప్పారు. ఈ సమీక్ష సందర్భంగా సర్వే రిపోర్ట్ తనకు అందిందని చెప్పారు. టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ కూడ ఆపలేరన్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. రోజు రోజుకు టీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోందన్నారు.

ఎన్నో త్యాగాలు చేసిన తెలంగాణను  వలసవాదులకు కట్టబెడుదామా అని కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబునాయుడును తెలంగాణ కాంగ్రెస్ నేతలు మళ్ళీ పట్టుకొస్తున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలకు చేతకాక అమరావతి నుండి  చంద్రబాబునాయుడును తీసుకొస్తున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

తెలంగాణ వచ్చాక కూడ చంద్రబాబునాయుడు పెత్తనం అవసరమా అని కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు ఎవరండీ.. మనకు గుర్తు లేని మనిషా... తెలంగాణకు ఎంత అన్యాయం చేశారో తెలియదా అని ఆయన విమర్శలు చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టులకు వ్యతిరేకంగా  చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖలు రాశాడన్నారు. 

చంద్రబాబుతో పాటు ఆయన మోసుకొస్తున్న కాంగ్రెస్ పార్టీని కాగ్నా నదిలో కలపాలని  కేసీఆర్ ప్రజలను కోరారు. రాజకీయంగా టీడీపీ, కాంగ్రెస్ కూటమికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చావుకు దగ్గరై తెలంగాణను సాధించినట్టు కేసీఆర్  తెలిపారు.

కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే  కరెంట్ కష్టాలు మళ్ళీ మొదలౌతాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో  విద్యుత్ కష్టాలు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ ఎన్నికలు తెలంగాణకు ఎంతో ముఖ్యమని  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పారు. నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో  43వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు.

తాండూరులో స్టోన్ కట్టింగ్ పరిశ్రమను త్వరలోనే పెడతామననారు.  దేశంలో ఏ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం లేదన్నారు.  నాలుగేళ్ల పాలనలో సంపదను పెంచుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నట్టు కేసీఆర్ చెప్పారు. రూ.4 వేల కోట్లతో తెలంగాణలో యాదవుల అభివృద్ధికి పాటుపడినట్టు కేసీఆర్ గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్ముకొన్నారని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేసిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన క్యామ మల్లేష్ తనతో ఫోన్ లో మాట్లాడారని... ఇవాళ టీఆర్ఎస్ లో చేరుతారని చెప్పారన్నారు.

సోనియా గాంధీ పర్యటన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఘాటుగా స్పందించారు. గత ఎన్నికల సమయంలో  కరీంనగర్, చేవేళ్ల,  ఆంథోల్ సభల్లో సోనియా గాంధీ సభల్లో పాల్గొన్నారని చెప్పారు.

2004లో తమ పార్టీతో  పొత్తు పెట్టుకొని గెలిచిన తర్వాత నాలుగు నెలల తర్వాత   తెలంగాణ ఇస్తే బాగుండేదన్నారు. కానీ 14 ఏళ్లు తెలంగాణ ఇవ్వకుండా సాచివేత ధోరణిని అవలంభించారన్నారు. తాను తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేస్తే  గత్యంతరం లేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని  కేసీఆర్ చెప్పారు.


సంబంధిత వార్తలు

కేసీఆర్‌కు తాజా ప్రతిపాదనలు: మేనిఫెస్టోకు తుది మెరుగులు

చిచ్చు పెడుతున్న చంద్రబాబు: సుహాసిని పోటీపై కేటీఆర్ వ్యాఖ్యలు

సెటిలర్ల ఓట్లకు గాలం: కేసీఆర్ వ్యూహం ఇదీ

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్

కేటీఆర్‌పై కేసు.. ఎన్నికల సంఘానికి నివేదిక

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూద్దాం: కేటీఆర్‌కు ఉత్తమ్ కౌంటర్

కేసీఆర్‌, కేటీఆర్‌పై పోటీ చేసే అభ్యర్థులెవరో తెలుసా?

"ఎంపీనో.. ఎమ్మెల్యేనో మరణిస్తేనే పట్టించుకుంటారా"... కేటీఆర్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్‌

ప్రగతి నివేదన సభ: 15 నిమిషాల్లో కేటీఆర్‌కు చొక్కా కుట్టించిన టైలర్

ట్విట్టర్‌లో కాదు మైదానంలో ఆడదాం రా...: కేటీఆర్‌కు రేవంత్ సవాల్