Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్ అవకతవకలపై న్యాయ విచారణకు హైకోర్టు నో

 ఇంటర్ పరీక్షల్లో లోపాలపై  జ్యూడీషీయల్ విచారణకు హైకోర్టు మాత్రం ఒప్పుకోలేదు. కానీ, ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేందుకు ఏం చర్యలు తీసుకొంటారో చెప్పాలని హైకోర్టు ఇంటర్ బోర్డును ప్రశ్నించింది

high court serious comments on inter board
Author
Hyderabad, First Published Apr 23, 2019, 5:27 PM IST

హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో లోపాలపై  జ్యూడీషీయల్ విచారణకు హైకోర్టు మాత్రం ఒప్పుకోలేదు. కానీ, ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేందుకు ఏం చర్యలు తీసుకొంటారో చెప్పాలని హైకోర్టు ఇంటర్ బోర్డును ప్రశ్నించింది. ఎన్ని రోజుల్లో విద్యార్థులకు న్యాయం చేస్తారో చెప్పాలని  ఇంటర్ బోర్డును హైకోర్టు ప్రశ్నించింది.

ఇంటర్ పరీక్షల్లో అవకతవకలపై బాలల హక్కుల సంఘం మంగళవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్‌పై‌ హైకోర్టు విచారణను మధ్యాహ్నం చేపట్టింది.

సుమారు 9లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే సుమారు 50 వేల మంది విద్యార్థులు ఇంటర్ బోర్డుకు వ్యతిరేకంగా  ఆందోళన చేస్తున్నట్టుగా  బాలల హక్కుల సంఘం తరపు న్యాయవాది  దామోదర్ రెడ్డి ప్రకటించారు.

మూడు లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలను రీ వాల్యూయేషన్  చేయడానికి ఎంత సమయం పడుతోందని కోర్టు ప్రశ్నించింది. రెండు మాసాలు సమయం పడుతుందని బోర్డు కార్యదర్శి చెప్పారు. అయితే రెండు నెలల సమయం ఎందుకు పడుతోందని ప్రశ్నించారు. 

అయితే వారం రోజుల్లో ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకొంటామని  విద్యాశాఖ హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ కేసు విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు  నిర్ణయం తీసుకొంది. సోమవారం నాడు ఉదయం 10గంటలకు ఈ కేసు విచారణ జరగనుంది.

ఈ కేసు విచారణ సమయంలో  విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేస్తారో విషయాన్ని ఇంటర్ బోర్డు హైకోర్టుకు నివేదించాల్సి ఉంది.విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హైకోర్టు ఇంటర్ బోర్డును ఆదేశించింది. జ్యూడీషీయల్ విచారణతో విద్యార్థులకు న్యాయం జరగదని హైకోర్టు అభిప్రాయపడింది.

సంబంధిత వార్తలు

రీ వెరిఫికేషన్‌కు రెండు రోజుల గడువు పొడిగింపు: ఇంటర్ బోర్డు

ఇంటర్ ఫలితాలపై రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి జగదీష్ రెడ్డి

ఆందోళన వద్దు: ఇంటర్ విద్యార్థులకు జనార్ధన్ రెడ్డి విజ్ఞప్తి

తప్పుడు ప్రచారమే: ఇంటర్ మార్కుల అవకతవకలపై గ్లోబరీన్ సీఈఓ

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్థులు సహా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అరెస్ట్

ఇంటర్ విద్యార్థులకు మరో షాక్: మొరాయిస్తున్న పోర్టల్

ఇంటర్ బోర్డు నిర్వాకం: అధికారులపైకి నెట్టేసి..., ఒక్కటే ప్రశ్న...

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకలు: హైకోర్టులో పిటిషన్

విద్యార్థుల ఆత్మహత్యల పాపం ఎవరిది: హత్య (తెలుగు కథ)

అందుకే గ్లోబరిన్‌కు అప్పగించాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్

ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థి సేవా దళ్ కార్యకర్తలు ధర్నా (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్: అమ్మాయి అరెస్టు (వీడియో)

ఇంటర్ బోర్డు ముందు ధర్నా: రేవంత్ రెడ్డి అరెస్టు(వీడియో)

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

ఇంటర్ ఫలితాలు.... మొన్న సున్నా.. నేడు 99

ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై కమిటీని నియమించిన ప్రభుత్వం

బోర్డు నిర్వాకం: ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ భరోసా

గుండె తరుక్కుపోతోంది: విద్యార్థుల ఆత్మహత్యలపై హరీష్ రావు

తప్పుల తడక: పిల్లలు ఉసురు పోసుకుంటున్న ఇంటర్ బోర్డు (వీడియో)

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం: ఐఐటీ కొట్టిన విద్యార్ధి మ్యాథ్స్‌‌లో ఫెయిల్

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య

 

Follow Us:
Download App:
  • android
  • ios