ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎంతో మంది విద్యార్ధులకు ప్రాక్టీకల్స్‌ మార్కులను కలపకపోవడానికి తోడు ఇప్పుడు ఏకంగా 50 వేల మంది విద్యార్ధులు ఒక్క మ్యాథ్స్‌లోనే ఫెయిల్ అవ్వడంతో బోర్డు నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అలాగే అసలు పరీక్షకు వెళ్లని విద్యార్థుల్ని పాస్ చేయడం, రీవాల్యుయేషన్‌ వెబ్‌సైట్ కూడా పనిచేయకపోవడంతో విద్యార్ధులు వారి తల్లిదండ్రులు బోర్డుపై మండిపడుతున్నారు.

ఆదిత్య మెహ్రా అనే విద్యార్థి ఐఐటీ ఎంట్రన్స్‌లో 80 శాతం పైగా మార్కులు తెచ్చుకున్నాడు. అలాంటి విద్యార్థి సెకండియర్‌ మ్యాథ్స్‌లో 16 మార్కులు తెచ్చుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. 

 

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య