సూర్యాపేట: ఇంటర్మీడియట్ ఫలితాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. కొందరు  ఉద్దేశ్యపూర్వకంగానే ఇంటర్ పరీక్షా ఫలితాలపై కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మంగళవారం నాడు ఆయన సూర్యాపేటలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇంటర్ ఫలితాల విషయంలో రాజకీయాలకు ప్రయత్నిస్తున్న  చిల్లర ప్రయత్నాలను విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించాలని ఆయన సూచించారు. 

ఇంటర్  పరీక్షల్లో అసలు ఏం జరిగిందనే  విషయమై విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు. అంతర్గత తగాదాలతో వచ్చిందా... నిజంగా ఏమైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సాంకేతికంగా తప్పులు జరిగినా ....దానికి బాద్యులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ఏ ఒక్కరిని కూడ నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకొంటామని ఆయన హామీ ఇచ్చారు. 

నిపుణుల కమిటీ బుధవారం సాయంత్రం లేదా గురువారం నాటికి నివేదిక ప్రభుత్వానికి అందిస్తోందన్నారు.ఆ నివేదిక ఆధారంగా తప్పు తేలితే దోషులు ఎంతటి స్థానంలో ఉన్నా చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురికాకుండా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

ఆందోళన వద్దు: ఇంటర్ విద్యార్థులకు జనార్ధన్ రెడ్డి విజ్ఞప్తి

తప్పుడు ప్రచారమే: ఇంటర్ మార్కుల అవకతవకలపై గ్లోబరీన్ సీఈఓ

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్థులు సహా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అరెస్ట్

ఇంటర్ విద్యార్థులకు మరో షాక్: మొరాయిస్తున్న పోర్టల్

ఇంటర్ బోర్డు నిర్వాకం: అధికారులపైకి నెట్టేసి..., ఒక్కటే ప్రశ్న...

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకలు: హైకోర్టులో పిటిషన్

విద్యార్థుల ఆత్మహత్యల పాపం ఎవరిది: హత్య (తెలుగు కథ)

అందుకే గ్లోబరిన్‌కు అప్పగించాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్

ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థి సేవా దళ్ కార్యకర్తలు ధర్నా (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్: అమ్మాయి అరెస్టు (వీడియో)

ఇంటర్ బోర్డు ముందు ధర్నా: రేవంత్ రెడ్డి అరెస్టు(వీడియో)

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

ఇంటర్ ఫలితాలు.... మొన్న సున్నా.. నేడు 99

ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై కమిటీని నియమించిన ప్రభుత్వం

బోర్డు నిర్వాకం: ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ భరోసా

గుండె తరుక్కుపోతోంది: విద్యార్థుల ఆత్మహత్యలపై హరీష్ రావు

తప్పుల తడక: పిల్లలు ఉసురు పోసుకుంటున్న ఇంటర్ బోర్డు (వీడియో)

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం: ఐఐటీ కొట్టిన విద్యార్ధి మ్యాథ్స్‌‌లో ఫెయిల్

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య