జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మార్కుల మూల్యంకనంలో అలసత్వంతో పాటు డేటా ఎంట్రీలోనూ తప్పుల తడక కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం సున్నా మార్కులు తెచ్చుకుని ఫెయిల్ అయ్యారు

telangana inter board gives zero marks to mancherial district topper

ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మార్కుల మూల్యంకనంలో అలసత్వంతో పాటు డేటా ఎంట్రీలోనూ తప్పుల తడక కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం సున్నా మార్కులు తెచ్చుకుని ఫెయిల్ అయ్యారు.

ఉదాహరణకు మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం చింతగూ గ్రామానికి చెందిన గజ్జి నవ్య జిన్నారంలోని కరమిల జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రాసింది.

మొదటి సంవత్సరంలో మంచిర్యాల జిల్లా టాపర్‌గా నిలిచిన నవ్య ఈసారి కూడా సీఈసీ విభాగంలో టాపర్‌గా నిలుస్తుందని ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భావించారు. ఫలితాలు విడుదలైన వెంటనే రిజల్ట్స్ చూసుకున్న ఆమెకు ఫలితం ఫెయిల్ అయినట్లుగా రావడంతో నివ్వెరపోయింది.

ప్రథమ సంవత్సరం పరీక్షల్లో తెలుగులో 98 మార్కులు సాధించిన నవ్యకు రెండో సంవత్సరంలో సున్నా వచ్చింది. అయినప్పటికీ ఆమె 825 మార్కులు సాధించడం విశేషం. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా టాపర్‌గా నిలవాల్సిన విద్యార్థిని ఫెయిల్ అయ్యిందని తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నవ్య సైతం తనకు జరిగిన అన్యాయానికి బోరున విలపిస్తోంది. బోర్డు అధికారులు జరిగిన తప్పిదాన్ని వెంటనే సరిచేసి తమ బిడ్డకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios