ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సమయంలో విద్యార్ధులకు, తల్లీదండ్రులకు అండగా ఉండాల్సిన బోర్డు అధికారి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పరీక్షల ఫలితాలు తప్పుల తడకగా ఉండటంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు శనివారం ఉదయం నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమయంలో అటుగా వచ్చిన బోర్డు కార్యదర్శి అశోక్‌ను ఘెరావ్ చేశారు.

పరీక్షల ఫలితాలల్లో అవకతవకలకు, 16 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత తీసుకోవాల్సిందిగా వారు ఆయనను డిమాండ్ చేశారు. దీంతో సహనం కోల్పోయిన అశోక్.. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం మాస్ హిస్టీరియా అని వ్యాఖ్యానించడం తల్లిదండ్రులకు ఆగ్రహన్ని తెప్పించింది.

దీంతో బోర్డు అధికారుల తీరుపై విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చేసిన తప్పులకు మా పిల్లలు ఎందుకు బలికావాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి ఎందుకు స్పందించటం లేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పిల్లలు డిప్రెషన్లోకి వెళ్లి చనిపోతున్నా పట్టించుకోరా..? అంటూ వారు మండిపడుతున్నారు. 

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో