హైదరాబాద్:  ఇంటర్ పరీక్షల్లో చోటు చేసుకొన్న అవకతవకలపై  బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్‌ను మంగళవారం నాడు దాఖలు చేసింది.

ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే  ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్  సోమవారం సాయంత్రం ప్రకటించారు. జవాబు పత్రాలన్నీ కూడ పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయని  కూడ ఆయన ప్రకటించారు. 

ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని  నిపుణుల కమిటీ ప్రాథమికంగా తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడ ఇచ్చింది. ఈ తరుణంలో  బాలల హక్కుల సంఘం మంగళవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ చేసే అవకాశం ఉంది.

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో 16 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని  డిమాండ్ చేశారు.విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని  బాలల హక్కుల సంఘం కోరింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.