Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్ ఫలితాలు.... మొన్న సున్నా.. నేడు 99

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఫలితాల్లో తేడాలు ఉన్నాయని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 

inter board effect, student got 99 marks after parents complaint
Author
Hyderabad, First Published Apr 22, 2019, 9:21 AM IST

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఫలితాల్లో తేడాలు ఉన్నాయని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ విద్యార్థినికి... మొన్న ఫలితాల్లో ఒక సబ్జెక్ట్ లో సున్నా మార్కులు రాగా.. ఆందోళన తర్వాత 99 మార్కులు అయ్యాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే...  మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కరిమల జూనియర్‌ కళాశాలలో చదివిన సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థిని గజ్జి నవ్య మార్కులను ఇంటర్‌ బోర్డు సవరించింది. నవ్య ఇటీవల సీఈసీ రెండో సంవత్సరం పరీక్షలు రాసింది. అన్ని సబ్జెక్టుల్లో ఆమెకు 95కుపైగా మార్కులు వచ్చాయి. 

తెలుగులో మాత్రం ‘సున్నా’ మార్కులే వేశారు. కానీ, మొదటి సంవత్సరం తెలుగులో ఆమెకు 98 మార్కులు వచ్చాయి. అప్పట్లో ఆమె మండల టాపర్‌ కూడా. దాంతో, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోళన చెందారు. పత్రికల్లో ఈ వార్త  ప్రముఖంగా వచ్చింది. కళాశాల యాజమాన్యం కూడా ఇంటర్‌ బోర్డుకు ఫిర్యాదు చేసింది. దాంతో, శనివారం సాయంత్రం ఇంటర్‌ బోర్డు అధికారులు స్పందించి మార్కులను సవరించారు. ఆమెకు సున్నాకు బదులు 99 మార్కులు వచ్చినట్లు సవరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios