Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఎన్నికల తెలంగాణా మేనిఫెస్టో ఇది

ప్రతి ఇంటికీ 2 ఉద్యోగాలు .

డ్వా క్రా  మహిళలకు  వడ్డీలేని  రుణాలు,   10 లక్షల వరకు 

ప్రతి పేదవాడికి  డూప్లె  హౌస్ తోపాటు  ఇన్నోవా  కారు ఉచితం

ప్రతి నిరుద్యోగికి నెలకు 50,000 తో పాటు ప్రభుత్వం తరుఫున ఉచిత క్రెడిట్ కార్డు 

a glimpse into next election manifest of Telangana parties

 

a glimpse into next election manifest of Telangana parties

వచ్చే ఎన్నికలకు, లేదా ముందస్తు ఎన్నికలకు  తెలంగాణా పార్టీల   మేనిఫెస్టో లు ఎలా ఉంటాయి?

 2014 నాటి మెనిఫెస్టో కంటే కచ్చితంగా  నాలుగు మాటలు ఎక్కువే  చెబుతాయి.

నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కుప్పలుకుప్పలే.

 పెన్షన్లు ఫుల్.  ఇంటికి సమిష్టిగా, ఇంట్లో వాళ్లకు విడివిడిగా వరాలుంటాయి.

 కులాలకు,మతాలకు వేర్వేరు ముచ్చట్లు

ఆడోళ్లకు, మగోళ్లకు,  ముసిలోళ్లకు, పోరగాళ్లకు... కనిపించిన ప్రతివారికి  అందాల్సినంత అందుతుంది.

అమలయితే తెలంగాణా వరల్డ్ క్లాస్ స్టేట్ అయిపోతుంది.

ఇండియాలో  నెంబర్ వన్ అవుతుంది.

ఇలాంటి మేనిఫెస్టో కోసం తెలంగాణా ప్రజలంతా ఎదరుచూస్తూనే ఉంటారని అందరికి  తెలుసు.

ఈ ఎదురుచూపులను దృష్టిలో పెట్టుకుని,అజ్ఞాత రచయిత ఒకరు ఒక ఇలా వెక్కిరించి అలా గాల్లో వదలిపెట్టారు. వివరాలివే...

***

1) ప్రతి ఇంటికీ 2 ఉద్యోగాలు .

2) 10 వ  తరగతి చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగం.

3) ఎంసెట్  క్వాలిఫై  అయిన వారికి విదేశాలలో  ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం .

4) ఇంజనీరింగ్ పాస్ అయిన వారికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాఫ్ట్ వేర్ కంపెనీ లలో  ఉద్యోగాలు ఇప్పిస్తాను ..

5) వృద్దులకు  నెలకు 30,000/-  వరకు పింఛను .

6) వితంతువులకు నెలకు 50,000/- వరకు పింఛను .

7)  డ్వా క్రా  మహిళలకు  వడ్డీలేని  రుణాలు . దాదాపు  10 లక్షల వరకు ఇస్తాను .

8) ఇంటి పన్ను , నీటి పన్ను , విద్యుత్ బకాయి లు , బ్యాంకు బకాయి లు , రైతుల రుణాలు అన్నీ మాఫీ .

9) వెలమలను  (SC) లలో చేరుస్తాను. రెడ్లను,  ముస్లింలను (ST) లలో చేరుస్తాను . వైశ్య , బ్రాహ్మణులను ( BC ) లలో చేరుస్తాను .

10) 1 వ తరగతి చదివే విద్యార్థులకు ఉచిత  (LAPTOP).

11) 5 వతరగతి నుండి 10 వ తరగతి   చదివే  విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్  మరియు ఫ్రీ డేటా .

12) హైదరాబాద్ ను "అమెరికా" చేస్తాను.

13) ప్రతి మండలానికి ఒక  ఐటీ హబ్ . ప్రతి నియోజక వర్గ కేంద్రాన్ని  ఒక స్మార్ట్ సిటీ  గా రూపుదిద్దుతాను ..

14)  ప్రతి పేదవాడికి  "డూప్లె"  హౌస్ తోటి పాటు "ఇన్నోవా " కారు ఉచితం.

15)  ప్రతి ఆడ పిల్లకీ కళ్యాణ లక్ష్మి పథకం కింద 10 లక్షలు నగదు తో పాటు 20 తులాల బంగారం .

16)  ప్రతి నియోజక వర్గానికి ఒక "విమాన శ్రయం" కట్టిస్తాను 

17) మందుబాబూరావులకు  అధార్ తో బార్ కార్డు .

18) ప్రతి నిరుద్యోగికి నెలకు 50,000 తో పాటు ప్రభుత్వం తరుపున ఉచిత క్రెడిట్ కార్డు .

19) ప్రతి పల్లెటూరుకి రింగ్ రోడ్ ..

20) ప్రతి రైతుకి  ఉచితం గా విత్తనాలు , ఎరువులు , పురుగుల మందులతో పాటు 24 గంటలు ఉచిత కరెంటు ...

21)  "కచర అన్న "   భోజన పధకం కింద 2/- రూపాయిలకే చికెన్ బిర్యాని మరియు  
          3/- రూపాయి లకు మటన్ బిర్యాని  .

   ఇవన్నీ కేవలం 1% మాత్రమే నేను  ముఖ్య మంత్రి అయ్యాక ఇంకా ఎన్నో, ఎన్నెన్నో ఉంటాయి .

నన్ను ముఖ్య మంత్రిని  చేయండి , మీ భవిష్యత్  బంగారు మాయం చేసుకోండి ...

 

 

ఇది ఏ పార్టీ మేనిఫెస్టో అయి ఉంటుంది ? ఈ గొంతు ఎవరిదై ఉంటుంది?

ఎ) తెలంగాణా రాష్ట్ర సమితి, కెసిఆర్

బి) తెలుగుదేశంపార్టీ, చంద్రబాబు నాయుడు

సి) కాంగ్రెస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి

డి) బిజెపి, కిషన్ రెడ్డి

ఇ) కోదండరామ్ కొత్త పార్టీ, ఫ్రొఫెసర్ కోదండరాం

ఎఫ్) జనసేన, పవన్ కల్యాణ్

 

(సమాధానాలు మాకు పంపాల్సిన అవసరం లేదు. పార్టీలు అసలు మేనిఫెస్టో విడుదల చేశాక మీరే పోల్చుకోండి.  సరదాగా నవ్వుకోండి)

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios