Asianet News TeluguAsianet News Telugu

ఉచితంగా హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ కావాలా.. అయితే ఇదిగో మీకోసం అద్భుతమైన ప్లాన్..!

క్రికెట్ చూడటానికి ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కోసం వెతుకుతున్నారా ? ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా నెట్‌వర్క్‌లతో ఉచిత ఓ‌టి‌టి సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ చూడవచ్చు...

Want free Hotstar.. Here's an amazing plan for you-sak
Author
First Published Mar 1, 2023, 4:19 PM IST

మార్చి 2023 నుండి ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ మ్యాచ్‌లు  ప్రారంభంకానున్నాయి. ఈసారి, ప్రముఖ టెలికాం ఆపరేటర్లు  ప్రీపెయిడ్ ఇంకా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌ను తొలగించాయి. ముఖ్యంగా జియో యూజర్లు చాలా కాలంగా ఎంజాయ్ చేస్తున్న  హాట్ స్టార్ ఆఫర్లు లేకపోవడంతో కొంత నిరాశకు గురవుతున్నారు. అయితే మీకు ఎయిర్‌టెల్ లేదా వోడాఫోన్-ఐడియా పోస్ట్‌పెయిడ్ సిమ్ ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఎయిర్ టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా(Vi) నెట్‌వర్క్‌ పోస్ట్‌పెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లతో డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. Hotstar ఈ రెండు నెట్‌వర్క్‌లతో డేటా ఇంకా వాయిస్ బెనెఫిట్స్ తో పాటు ఉచిత ఓ‌టి‌టి సబ్‌స్క్రిప్షన్  కూడా అందిస్తుంది. 

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్:
రూ.499: ఈ ప్లాన్ తో 75జి‌బి డేటా రోల్‌ఓవర్, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోకి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 SMSలతో వస్తుంది.

రూ. 999: ఈ ప్లాన్ కింద మీరు ఫ్యామిలీ యాడ్-వన్‌గా 3 నంబర్‌లతో 1 సిమ్ కార్డ్‌ని కనెక్ట్ చేయవచ్చు. ఇది మొత్తం 100 GB డేటా రోల్‌ఓవర్‌ను అందిస్తుంది. ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా అందించబడతాయి. OTT పరంగా ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది.

రూ. 1199: పై ప్లాన్ లాగానే ఈ ప్లాన్ కూడా 1 సిమ్, 3 ఉచిత ఫ్యామిలీ యాడ్-ఆన్ సౌకర్యం, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే 150GB డేటా కూడా అందించబడుతుంది.

రూ. 1499: ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 4 ఉచిత ఫ్యామిలీ యాడ్-ఆన్‌లు, 200GB డేటా రోల్‌ఓవర్, రోజుకు 100 SMSలు, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ వీడియోతో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ కూడా అందించబడుతుంది.

Vi- పోస్ట్‌పెయిడ్ ప్లాన్:

రూ. 501: ఈ ప్లాన్‌తో  Vi 90GB డేటా రోల్‌ఓవర్, ఆన్ లిమిటెడ్ కాలింగ్, నెలకు 3000 SMSలు, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. అదనంగా ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్, Vi మూవీస్ అండ్ టీవీ, హంగామా మ్యూజిక్ మరిన్నింటికి సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందిస్తుంది.

రూ.701: ఈ ప్లాన్ ఆన్ లిమిటెడ్ డేటా, కాల్స్ ఇంకా 3000 SMSలను అందిస్తుంది. దీనితో డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్, అమెజాన్ ప్రైమ్ ఇంకా మరిన్నింటికి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఉంది.

రూ. 1101: ఈ ప్లాన్ Vi అత్యంత ఖరీదైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ ఆన్ లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్, నెలకు 3000 SMS, అమెజాన్ ప్రైమ్, డిస్ని + హాట్ స్టార్ సూపర్ కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios