నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. కాగా... ఇటీవల తీవ్ర అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.
అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు.
అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...
సుష్మా స్వరాజ్ కు ఉన్నట్లే అరుణ్ జైట్లీకి కూడా అన్ని పార్టీల్లోనూ సన్నిహిత మిత్రులు ఉన్నారు. మోడీ తొలి విడత ప్రభుత్వంలో బలమైన మంత్రుల్లో అరుణ్ జైట్లీ కూడా ఒక్కరు. తెర వెనక వ్యూహకర్తగా ఆయనకు పేరుంది.
అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....
విద్యార్ధి సంఘం నేత నుండి అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రి స్థాయికి ఆయన ఎదిగారు. అరుణ్ జైట్లీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు.
డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..
డి-4 లేదా ఢిల్లీ4 గా పిలువబడే నలుగురిలో అరుణ్ జైట్లీ మరణంతో ఇప్పుడు కేవలం ఒక్క వెంకయ్య నాయుడు మాత్రమే జీవించి ఉన్నారు.సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఈ నలుగురిని డి 4 గా వ్యవహరిస్తుంటారు.
అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...
అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే ఎనలేని అభిమానం. ఆయన ఢిల్లీ క్రికెట్ సంఘం అధిపతిగా పనిచేశారు. అత్యవసర పరిస్థితి కాలంలో జైలు జీవితం అనుభవించారు. జెపితో కలిసి ఆయన ఆ కాలంలో పనిచేశారు.
తెలంగాణ బిల్లు: అరుణ్ జైట్లీ కీలక పాత్ర
తెలంగాణ బిల్లు గట్టెక్కడంలో కేంద్ర మాజీ మంంత్రి అరుణ్ జైట్లీ కీలకపాత్ర పోషించారు. ఏపీ, తెలంగాణలకు మేలు జరిగేలా ఆయన ఆ సమయంలో వ్యవహరించారు.
కోలుకుంటారని ఆశిస్తున్న స్థితిలో...: జైట్లీ మృతికి చంద్రబాబు సంతాపం
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జైట్లీ కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో మనకు దూరం కావడం దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు కేంద్ర మంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, కేంద్ర మంత్రిగా జైట్లీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు.
తెలంగాణ బిల్లు: ఆ ఇద్దరు కీలక నేతల మృతి
బీజేపీ అంటేనే మనకు గుర్తొచ్చేది మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్స్. హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రచారావాహికగా, సాంప్రదాయకవాద రాజకీయనాయకుల సమూహంగా మనకు కనపడుతుంది బీజేపీ పార్టీ అలంటి బీజేపీలో డిఫరెంట్ గా మనకు కనపడే వ్యక్తి అరుణ్ జైట్లీ.
జైట్లీ మృతిపై కపిల్ సిబల్ దిగ్భ్రాంతి : క్రికెట్ లో మేమిద్దరం అంటూ ఫోటోలు విడుదల
అరుణ్ జైట్లీ పార్టీలకతీతంగా అభిమానులను సంపాదించుకున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతగా కూడా ఎంతో హుందాగా వ్యవహరించారని గుర్తు చేశారు. తన స్నేహితుల కోసం, పార్టీ కోసం స్థిరంగా నిలబడిన వ్యక్తి అరుణ్ జైట్లీ అంటూ కొనియాడారు.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు
మాజీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు వచ్చింది.ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.
గంటా భవనం కూల్చివేతకు నోటీసులు.. హైకోర్టు సస్పెన్షన్
జీవీఎంసీ అధికారులు తమ భవనాన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారంటూ పిటిషనర్లు అత్యవసరంగా అభ్యర్థించడంతో జస్టిస్ జి.శ్యాంప్రసాద్ శుక్రవారం తెల్లవారుజామున పిటిషన్‌పై విచారణ జరిపారు.
ఏపీ ప్రజలంటే జైట్లీకీ ప్రత్యేక అభిమానం: సుజనాచౌదరి
దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. అరుణ్ జైట్లీతో తొమ్మిదేళ్లు కలసి పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఏపీ విభజన చట్టం అమలులో జైట్లీతో కలసి పనిచేశానని సుజనా చౌదని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే జైట్లీకీ ప్రత్యేక అభిమానం ఉండేదని చెప్పుకొచ్చారు.
రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్
పోలవరం హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్టులకు విడివిడిగా టెండర్లు నిర్వహించాలా వద్దా అనే అంశంపై న్యాయనిపుణలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే పోలవరం హెడ్ వర్క్స్ టెండరింగ్ కు వచ్చిన దరఖాస్తులతోనే ముందుకు వెళ్లాలా అనే అంశంపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
బిగ్ బాస్ 3: హౌస్ మేట్స్ మధ్య గొడవ పెట్టేసిన బిగ్ బాస్!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 33 ఎపిసోడ్‌లను పూర్తి చేసి శుక్రవారం నాటితో 34 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
‘సాహో’ టాక్.. ఆ మైనస్ లు ఉన్నా అదుర్స్
సాహో’ సినిమా కోసం కేవలం తెలుగు పరిశ్రమ మాత్రమే కాదు.. మొత్తం ఇండియన్ సినిమా వేచి చూస్తోంది. దానికి కారణం బాహుబలితో ప్రభాస్ కు వచ్చిన ఇమేజ్, హైప్. ఇప్పటికే విడుదలైన సాహో పోస్టర్స్, ట్రైలర్స్ ,సాంగ్స్ కూడా సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ని పెంచేసాయి. బాలీవుడ్ సినిమా సైతం షాక్ అయ్యేలా ఉన్న విజువల్స్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకువెళ్లిపోయాయి. దానికి తోడు సాహో కోసం ప్రభాస్ కూడా తెగ కష్టపడుతున్నాడు.
‘బాహుబలి’వల్లే గుర్తింపు..కానీ సమస్యలు తెచ్చిపెట్టింది
‘‘బాహుబలి’ వల్ల నాకు గుర్తింపు లభించి ఉండొచ్చు. కానీ స్వేచ్ఛ పోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, కొన్ని దేశాల్లోని వారికి నేను తెలుసు. ఇంతకు ముందు చాలా సార్లు ముంబయికి వచ్చాను. అప్పుడు నన్నెవరూ గుర్తు పట్టలేదు. కానీ ఇప్పుడు నన్ను గుర్తుపట్టి, దగ్గరికి వస్తున్నారు. ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లే స్వేచ్ఛను కోల్పోయాను’అన్నారు ప్రభాస్.
బల్గేరియాకు జూ.ఎన్టీఆర్.. కళ్ళు చెదిరేలా యాక్షన్ సీన్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న క్రేజీ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే కావడంతో ఆసక్తి నెలకొంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి కొంత భాగం షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ కోసం బల్గేరియా బయలుదేరి వెళ్ళింది.
బాలయ్యను చూసి షాకైన హాట్ బ్యూటీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాల్ చౌహన్ బాలయ్యతో ఇది వరకే రెండు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. డిక్టేటర్ - లెజెండ్ సినిమాల్లో నందమూరి హీరోతో స్క్రీన్ షేర్ చేసుకొని మంచి సక్సెస్ అందుకున్న సోనల్ ఇప్పుడు మూడవసారి బాలయ్య సినిమాలో హాట్ గా కనిపించనుంది.
సాహో వర్కౌట్ అయితేనే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'సాహో'.సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 24, 2019, 5:40 PM IST