న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి. ఢిల్లీ క్రికెట్ బాడీకి ఆయన అధిపతిగా కూడా పనిచేశారు. అరుణ్ జైట్లీ సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. స్వర్గీయ ఇందిరా గాంధీ ప్రభుత్వం 1975 - 77 మధ్య దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో ఆయన జైలు జీవితాన్ని గడిపారు. 

జెపిగా ప్రసిద్ధి పొందిన జయప్రకాష్ నారాయణతో ఆయన అత్యవసర పరిస్థితి కాలంలో కలిసి పనిచేశారు. ఎమర్జెన్సీలో అత్యంత ప్రఖ్యాతి వహించి యువ నేతల్లో అరుణ్ జైట్లీ ఒక్కరు. ఆయన 29 నెలల పాటు జైల్లో ఉన్నారు. 

జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన జన్ సంఘ్ లో చేరారు. 1980లో బిజెపి ఏర్పడింది. వెంటనే ఆయన బిజెపిలో చేరారు. ఆయన బిజెపి యువజన విభాగాన్నికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఢిల్లీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. 

విపి సింగ్ ప్రభుత్వం ఆయనను 1989లో అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా నియమించింది. బోఫోర్స్ కుంభకోణం కేసులో ఆయన తన న్యాయవాద పటిమను ప్రదర్శించారు. కాంగ్రెసుకు బద్ద వ్యతిరేకి అయినప్పటికీ జైట్లీ మాధవరావు సింధియా కేసును చేపట్టారు. 

related news

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం