న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ మృతి తనను ఎంతో కలవరపాటుకు గురి చేసిందన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్. జైట్లీ మృతిపట్ల కపిల్‌ సిబల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మృతికి సంతాపం తెలిపారు. 

ఈ సందర్భంగా అరుణ్ జైట్లీతో తన స్నేహానికి గుర్తుగా ఓ అరుదైన ఫోటోను ట్వీట్‌ చేశారు కపిల్‌ సిబల్‌. ‘క్రికెట్‌లో మేమిద్దరం’ అనే క్యాప్షన్‌ ఇస్తూ ఫోటోను పోస్ట్ చేశారు కపిల్ సిబల్. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

అరుణ్‌ జైట్లీ మరణించారనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. తన పాత స్నేహితుడు, ప్రియమైన సహోద్యోగి జైట్లీ అంటూ గుర్తు చేశారు. ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక రంగానికి జైట్లీ చేసిన సేవలు కలకాలం గుర్తిండిపోతాయన్నారు. 

అరుణ్‌ జైట్లీ పార్టీలకతీతంగా అభిమానులను సంపాదించుకున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతగా కూడా ఎంతో హుందాగా వ్యవహరించారని గుర్తు చేశారు. తన స్నేహితుల కోసం, పార్టీ కోసం స్థిరంగా నిలబడిన వ్యక్తి అరుణ్ జైట్లీ అంటూ కొనియాడారు.  

అనంతరం అరుణ్‌ జైట్లీతో కలిసి గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అరుణ్‌ జైట్లీతో కలిసి దిగిన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అరుణ్‌ జైట్లీ క్రికెట్‌కు వీరాభిమాని అని చెప్పుకొచ్చారు. 

ఓ దశాబ్దం పాటు అరుణ్ జైట్లీ ఢిల్లీ, డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కు అధికారిగా పనిచేశారు. ఆ సమయంలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జైట్లీ ఎంతో కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. అంతేకాదు క్రికెట్‌ నిర్వహకుడిగా అరుణ్‌ జైట్లీ కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారని గుర్తు చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ ప్రజలంటే జైట్లీకీ ప్రత్యేక అభిమానం: సుజనాచౌదరి

మోడీకి ఢిల్లీ గేట్స్ తెరిచింది జైట్లీనే

తెలంగాణ బిల్లు: ఆ ఇద్దరు కీలక నేతల మృతి

తెలంగాణ బిల్లు: అరుణ్ జైట్లీ కీలక పాత్ర

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి..

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం