బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాల్ చౌహన్ బాలయ్యతో ఇది వరకే రెండు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. డిక్టేటర్ - లెజెండ్ సినిమాల్లో నందమూరి హీరోతో స్క్రీన్ షేర్ చేసుకొని మంచి సక్సెస్ అందుకున్న సోనల్ ఇప్పుడు మూడవసారి బాలయ్య సినిమాలో హాట్ గా కనిపించనుంది. కెఎస్.రవికుమార్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 

రీసెంట్ గా బాలకృష్ణకు సంబందించిన ఒక లుక్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ అందరికి షాక్ ఇచ్చింది. సోనాల్ కూడా షూటింగ్ లో బాలయ్య కొత్త లుక్ ని చూసి ఆశ్చర్యపోయిందట. సూటు బూటు వేసుకొని స్టైలిష్ గా కనిపించడంతో చూపు తిప్పుకోలేకపోయానని ఆయన పాత్ర సినిమాలో అద్భుతంగా ఉంటుందని సోనాల్ వివరణ ఇచ్చింది. 

అదే విధంగా సినిమాలో తన పాత్ర బోల్డ్ గా ఉంటుందని చెబుతూ బాలయ్యతో ముడవసారి నటించడం చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. ఇక సినిమాలో సోనల్ బికినీ లుక్ లో దర్శనమివ్వనున్నట్లు టాక్ వస్తోంది. గ్లామర్ డోస్ కూడా హై రేంజ్ ఉంటుందని సమాచారం. వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ వేసుకుంటోంది.