న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బలమైన మద్దతుదారుగా నిలిచిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూశారు. అరుణ్ జైట్లీ మరణం బిజెపికి పెద్ద దెబ్బనే. సుష్మా స్వరాజ్ లాగే న్యాయవాద వృత్తి నుంచి అరుణ్ జైట్లీ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 

సుష్మా స్వరాజ్ కు ఉన్నట్లే అరుణ్ జైట్లీకి కూడా అన్ని పార్టీల్లోనూ సన్నిహిత మిత్రులు ఉన్నారు. మోడీ తొలి విడత ప్రభుత్వంలో బలమైన మంత్రుల్లో అరుణ్ జైట్లీ కూడా ఒక్కరు. తెర వెనక వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. 

రెండో సారి మోడీ నాయకత్వంలోని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అరుణ్ జైట్లీ ఏ విధమైన బాధ్యతలు తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు. కొత్త ప్రభుత్వంలో తాను బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేనని ఆయన స్పష్టం చేశారు. 

తనకు, తన చికిత్సకు, తన ఆరోగ్యానికి తగిన వ్యవధిని ఇచ్చుకునేందుకు వీలు కల్పిస్తూ తనకు ఏ విధమైన బాధ్యతలు కూడా అప్పగించవద్దని ఆయన మోడీని కోరారు. తన ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించే ఉద్దేశంతో తాను బాధ్యతలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 

గత కొద్ది నెలల కాలంలో ఆయన అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే బయటకు వచ్చారు. తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తూ వచ్చారు. బిజెపి ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన జైట్లీ ప్రధానమైన ఆర్థిక చట్టాల రూపకల్పనలో పాలు పంచుకున్నారు. ప్రభుత్వ వివాదాస్పద విధానాలను ఆయన బలంగా సమర్థిస్తూ వచ్చారు. 

సుష్మా స్వరాజ్ మాదిరిగానే అద్వానీ కోర్ టీమ్ లో అరుణ్ జైట్లీ కూడా ఒక్కరు. ఆ తర్వాత నరేంద్ర మోడీతో బంధం గట్టిపడుతూ వచ్చింది. గుజరాత్ కు, న్యూఢిల్లీకి మధ్య వారధిగా పనిచేసిన క్రమంలో మోడీతో అనుబంధం పెరుగుతూ వచ్చింది. 

related news

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం