న్యూఢిల్లీ: ఏపీ పునర్విభజన బిల్లు రాజ్యసభలో పాస్ కావడంలో అరుణ్ జైట్లీ చాలా కీలకంగా వ్యవహరించారు.ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు దక్కాల్సిన వాటాల విషయంలో ఆయన జైట్లీ వెనక్కు తగ్గలేదు.

2004 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.కానీ ఆ హమీని 2009 ఎన్నికల సమయంలో కూడ నెరవేర్చలేదు.

2009 డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ తర్వాత ఏపీ ప్రాంతంలో ఉద్యమాలు సాగాయి. అయితే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ వెనక్కు తగ్గలేదు. 2014 ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఏపీ పునర్విభజన బిల్లును పార్లమెంట్ లో పాస్ చేయించింది.

ఏపీ పునర్విభజన బిల్లు కు అనుకూలంగా లోక్ సభలో బీజేపీ పక్ష నేతగా ఆ సమయంలో సుష్మాస్వరాజ్, రాజ్యసభలో అరుణ్ జైట్లీ బీజేపీపక్ష నేతగా ఉన్నారు.ఏపీ పునర్విభజన బిల్లు చర్చ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయమై అరుణ్ జైట్లీ అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ఐదేళ్లు కాదు పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఉండాలని అరుణ్ జైట్లీ కోరారు.ఏపీకి ప్రత్యేక హోదా విషయమై తాము కట్టుబడి ఉన్నామని ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చాడు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఆయన పదే పదే ప్రశ్నించాడు. చివరకు ఈ బిల్లుకు అనుకూలంగా బీజేపీ ఓటు చేసింది.దీంతో ఆనాడు ఏపీ పునర్విభజన బిల్లు గట్టెక్కింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో హైద్రాబాద్ విషయాన్ని పెద్ద ప్రతిబంధకంగా చూపే ప్రయత్నం చేశారు. హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కూడ ఆ సమయంలో డిమాండ్లు వచ్చాయి.

హైద్రాబాద్ లేని తెలంగాణ తమకు అవసరం లేదని టీఆర్ఎస్ సహా తెలంగాణకు చెందిన కొందరు నేతలు స్పష్టం చేశారు.హైద్రాబాద్  తెలంగాణకే దక్కాలని అరుణ్ జైట్లీ వాదించారు. హైద్రాబాద్ ను తెలంగాణతో విడదీస్తే చిక్కులు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడినట్టుగా కొందరు నేతలు గుర్తు చేసుకొంటున్నారు.

హైద్రాబాద్ ను తెలంగాణకు ఉండేలా... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడ ఆయన ఈ బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఆయన పట్టుబట్టారు. ఈ బిల్లు గట్టెక్కడంలో ఆయన పాత్రను మరవలేమని తెలంగాణ వాదులు గుర్తు చేసుకొంటున్నారు.

సంబంధిత వార్తలు

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం