మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

మాజీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు వచ్చింది.ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.

Former AP Speaker Kodela Siva Prasada Rao suffers heart stroke

గుంటూరు:మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావుకు శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం నాడు ఉదయం కోడెల నివాసంలో కంప్యూటర్లను కొందరు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో వైఎస్ఆర్ సీపీ నేతల హస్తం ఉందని కోడెల ఆరోపించారు. శుక్రవారం నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన సత్తెనపల్లిలోనే ఉన్నారు.

శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆయన గుంటూరుకు చేరుకొన్నారు. పార్టీ నాయకులు, న్యాయవాదులతో ఫోన్లో మాట్లాడుతున్నసమయంలనే ఆయనకు గుండెపోటు వచ్చింది.  వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోడెల అల్లుడు డాక్టర్ మనోహర్ వైద్యపరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.

నలుగురు డాక్టర్ల వైద్య బృందం కోడెలకు చికిత్స అందించారు. గుంటూరులోని కోడెల తనయుడు కోడెల శివరామ్ షోరూమ్ లో అసెంబ్లీ ఫర్నీచర్ ను లెక్కలు తీసేందుకు శుక్రవారం నాడు అసెంబ్లీ, రవాణా అధికారులు షోరూమ్ లో తనఖిలు చేశారు. 

అదే రోజులన స్కిల్ డెవలప్ మెంట్ కార్యాలయంలో 30 ల్యాప్ టాప్ లు పోయాయని కోడెల కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు అందింది.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
 

సంబంధిత వార్తలు

కోడెల ఫర్నీచర్ దోచేస్తే, చంద్రబాబు ప్రజాధనాన్ని దాచేశారు : ఇద్దరూ దొంగలేనన్న ఏపీ మంత్రి

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios