Asianet News TeluguAsianet News Telugu

ఈ వార్తలు మిస్సయ్యారా....


నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

Top Stories of the day
Author
Hyderabad, First Published Jun 11, 2019, 5:25 PM IST

 

అసంతృప్తి: రోజా, ఆర్కేలకు ఫోన్లు, జగన్‌తో భేటీకి పిలుపు

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరికాసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ కానున్నారు.



నన్నెవరూ పిలవలేదు, నేనే వచ్చా: రోజా ట్విస్ట్


వైసీపీ ఎమ్మెల్యే రోజా ట్విస్టిచ్చారు. తనను అమరావతికి రావాలని ఎవరూ పిలవలేదని  రోజా స్పష్టం చేశారు. తాను అసెంబ్లీ సమావేశాల్లో  పాల్గొనేందుకు వచ్చినట్టు రోజా స్పష్టం చేశారు.

 

ఏపీ సెక్రటేరియట్ లో కత్తి మహేష్ హడావిడి

సినీ క్రిటిక్ కత్తి మహేష్....ఆంధ్రప్రదేశ్  సెక్రటేరియట్ లో హడావిడి చేశారు. మంగళవారం ఉదయం కత్తి మహేష్... అమరావతిలోని ఏపీ సెక్రటేరియట్ కి వెళ్లారు.

 

రోజా ఇష్యూ, జగన్ కు విజయశాంతి సూచన, కేసీఆర్ పై ఫైర్

సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని వారికి కూడా తగిన గుర్తింపు ఇష్తే బాగుంటుందని తాను చెప్పదల్చుకున్నట్లు ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లోనైనా జగన్ రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు విజయశాంతి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

 

దేవినేని ఉమా, కొడాలి నాని మధ్య చిచ్చు: పాత గాయాన్ని కెలికిన కేశినేని


తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తాజాగా ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు పార్టీలో కలకలం రేపుతోంది. మాజీ మంత్రి, టీడీపి నేత దేవినేని ఉమా మహేశ్వర రావును లక్ష్యం చేసుకుంటూ ఆయన ఆ పోస్టు పెట్టారు.

 

గుర్తించనే లేదు: పవన్ కల్యాణ్ ఫై రావెల సంచలన వ్యాఖ్యలు


నా సూచనలు పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. కనీసం తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. రాజకీయ వ్యూహాలపై మాట్లాడదామని ప్రయత్నించానని కానీ పవన్ కళ్యాణ్ ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పారు రావెల కిషోర్ బాబు.
 

కేంద్ర ఆదేశాలు బేఖాతరు: పవర్ డీల్స్ పై విచారణకే జగన్ మొగ్గు

విండ్, సోలార్ ఎనర్జీ డెవలపర్స్ తో గత ప్రభుత్వం చేసుకున్న పిపిఎలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన తొలి ప్రసంగంలో బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

'బ్రోచేవారెవ‌రురా'.. రిలీజ్ ఎప్పుడంటే..?


శ్రీవిష్ణు, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'బ్రోచేవారెవ‌రురా'. ఈ చిత్రం జూన్ 28న విడుద‌ల కానుంది. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో చిత్రం 'బ్రోచేవారెవ‌రురా' కావ‌డం గ‌మ‌నార్హం.

 

చిరు కోసం తమన్నా కాస్ట్లీ డ్రెస్.. డిజైన్ చేసిందెవరో తెలుసా!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా సైరా విశేషాలని తెలియజేసింది. ఈ చిత్రం కోసం తాను అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్స్ ధరించినట్లు తెలిపింది. ఈ సైరా చిత్రంలో కాస్ట్లీ లెహెంగా ధరించాను. ఇప్పటివరకు నేను ధరించిన ఖరీదైన దుస్తులు ఇవే. వీటిని చిరంజీవి కుమార్తె సుస్మిత, ప్రముఖ డిజైనర్ అంజు మోడీ కలసి డిజైన్ చేసినట్లు తమన్నా తెలిపింది.

 

హీరోయిన్లతో యూవీ లవ్ ట్రాక్.. అందరూ బాలీవుడ్ భామలే!

టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అత్యుత్తమ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న యువరాజ్ టీమిండియా తరఫున ఆడే రోజుల్లోనే బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నాడు.

 

బుమ్రాతో అనుపమ లవ్ ట్రాక్.. హీరోయిన్ క్లారిటీ!


ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్, బుమ్రా ప్రేమలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చలు నడుస్తున్నాయి. గతంలో బుమ్రాకి రాశిఖన్నాతో లింక్ చేసి వార్తలు రాశారు. అయితే రాశి అలాంటిదేమీ లేదని చెప్పడంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. 

 

యువి రిటైర్మెంట్ పై మాజీ ప్రేయసి కామెంట్!


మాజీ ప్రియురాలు కిమ్ శర్మ కూడా స్పందించింది.  ''యూవీ అదుతంగా ఆడావు.. నీ ఆట, రికార్డులు మరువలేనివి. హేజల్ కీచ్ తో నీ మిగతా జీవితం కూడా ఇలానే విజయవంతం కావాలని కోరుకుంటున్నాను'' అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది.

 

నెటిజన్ల కామెంట్స్ పై సురేఖా వాణి కూతురు ఘాటు రిప్లై!

నటి సురేఖా వాణి కూతురు సుప్రీత కూడా నెటిజన్లపై మండిపడింది. టీనేజర్ అయిన సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. టిక్ టాక్ వీడియోలు, అలానే తనకు సంబంధించిన మరికొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్ల సంఖ్యని పెంచుకుంటోంది

 

టీమిండియాకు షాక్...వరల్డ్ కప్ నుండి శిఖర్ ధావన్ ఔట్

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో టీమిండియీకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో విరుచుకుపడ్డ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచ కప్ దూరమయ్యాడు.  ఈ మ్యాచ్ లో తీవ్కంగా గాయమవడంతో మూడు వారాల పాటు అతడికి విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో ప్రపంచ కప్ టోర్నీకి అతడు దూరం కానున్నాడు. 

 

యువీ రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ రెస్పాన్స్ ఇదే..

ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్...ఇంటర్నేషనల్ క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా... ఆయన రిటైర్మెంట్ పై టీం ఇండియా క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్పందించాడు.

 

Follow Us:
Download App:
  • android
  • ios