సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరంగా బాగా తగ్గింది. దీంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను నేరుగా చెబుతున్నారు. అయితే ఒక్కోసారి హద్దుమీరి సెలబ్రిటీల వ్యక్తిగత వ్యవహారాల్లో కూడా కల్పించుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలో చాలా మంది సెలబ్రిటీలు నెటిజన్లకు ఘాటుగా బదులిచ్చారు. ఇప్పుడు నటి సురేఖా వాణి కూతురు సుప్రీత కూడా నెటిజన్లపై మండిపడింది. టీనేజర్ అయిన సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. టిక్ టాక్ వీడియోలు, అలానే తనకు సంబంధించిన మరికొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్ల సంఖ్యని పెంచుకుంటోంది.

 అయితే ఇటీవల తన తండ్రి చనిపోయినప్పుడు తలకొరివి పెట్టిన వీడియోలను కూడా షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడ్డారు. దీంతో సుప్రీతతో పాటు సురేఖావాణి కూడా బాధపడిందట. దీంతో తమను తిట్టినవాళ్లకు ధీటుగా సమాధానమిచ్చింది సుప్రీత. తాజాగా ట్రోలర్స్ ని ఉద్దేశిస్తూ ఘాటుగా కామెంట్స్ చేసింది.

తమపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నవారు అన్నీ తెలుసుకొని అప్పుడు విమర్శించాలని.. ఎదుటివారిపై ఒక వేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్లు మనల్నే చూపిస్తాయనే విషయం గుర్తుంచుకోవాలని రాసుకొచ్చింది. ముందు మీ లైఫ్ చూసుకోండి.. ఆ తరువాత ఇతరుల విషయాల్లో వేలు పెట్టండి అంటూ క్లాస్ తీసుకుంది. తన తల్లి ఇప్పుడిప్పుడే భర్త మరణం నుండి కోలుకుంటుందని చెప్పుకొచ్చింది.