ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్...ఇంటర్నేషనల్ క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా... ఆయన రిటైర్మెంట్ పై టీం ఇండియా క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఇప్పటికే సచిన్ , కోహ్లీ, ధోనీ, వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ లాంటివారంతా యూవీ రిటైర్మెంట్ పై స్పందించగా.. తాజాగా... రోహిత్ కూడా రెస్పాండ్ అయ్యాడు.

కాకపోతే... అందరిలా కాకుండా రోహిత్ కొంచెం భిన్నంగా స్పందించాడు. యూవీ రిటైర్మెంట్ ఇలా జరగాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. ‘ఈ క్షణం వరకు నువ్వు ఎంత సాధించావో నీకు తెలియడం లేదు. లవ్ యు బ్రదర్. నీకు మంచి వీడ్కోలు లభించాల్సి ఉండాల్సింది’ అని రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. 

కాగా..రోహిత్ ట్వీట్‌కు యువీ వెంటనే స్పందించాడు. ‘నేను లోలోపల ఎలాంటి అనుభూతికి లోనవుతున్నానో నీకు తెలుసు. లవ్ యు బ్రదర్. నువ్వు లెజెండ్‌గా సాగిపో’ అని యువరాజ్ రీట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో పాటు.. రోహిత్ శర్మ.. యూవీని హత్తుకున్న ఫోటో కూడా పోస్టుచేశారు. వీరి ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వీరిద్దరి ట్వీట్ అభిమానులు ఫిదా అయ్యారు. అభిమానునలు కూడా తమ ప్రేమాభిమానాలను ట్వీట్స్ రూపంలో  యూవీకి ఘనంగా వీడ్కోలు చెబుతున్నారు.